AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: గ్యాస్ సిలెండర్ లీక్ అవుతోందా? కంగారు వద్దు.. ఇలా చేయండి..

మీరు వంట గ్యాస్ కొత్తది తీసుకున్నారు. దానిని సీల్ తో మీకు డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సిలెండర్ రెండు రోజుల తరువాత మీరు ఉపయోగించడం కోసం సీల్ ఓపెన్ చేశారు. అప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది.

LPG Cylinder: గ్యాస్ సిలెండర్ లీక్ అవుతోందా? కంగారు వద్దు.. ఇలా చేయండి..
KVD Varma
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 18, 2021 | 5:23 PM

Share

LPG Cylinder: మీరు వంట గ్యాస్ కొత్తది తీసుకున్నారు. దానిని సీల్ తో మీకు డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సిలెండర్ రెండు రోజుల తరువాత మీరు ఉపయోగించడం కోసం సీల్ ఓపెన్ చేశారు. అప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దీంతో మీరు కంగారు పడతారు. మొదట ఏమి చేయాలో అర్ధం కాదు. ఎందుకంటే, లీక్ ఆపడం మీకు తెలీదు. రెండోది సీల్ ఓపెన్ చేసిన తరువాత లీకేజీకి గ్యాస్ కంపెనీ బాధ్యత వహిస్తుందా అనే అనుమానం వెంటాడతాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు లీక్జీ గమనించిన వెంటనే ఒక ఫోన్ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అధికారిక సోషల్ మీడియా ఆధ్వర్యంలోని ట్విట్టర్ ఫిర్యాదుల పరిష్కార వేదిక MoPNG వెల్లడించింది.

ఒక వినియోగదారుడు ఈ వేదికపై గ్యాస్ లీకేజీపై ఫిర్యాదు చేశారు. ఈ వేదిక పై ఇంధనానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ వినియోగదారుని ఫిర్యాదుపై స్పందించిన MoPNG ట్విట్టర్ వేదిక ఇలా చెప్పింది.

ఈ నంబర్‌కు కాల్ చేయండి ఒక వినియోగదారు వ్రాశారు – గ్యాస్ సిలిండర్‌లో లీక్. కానీ నేను ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయలేకపోతున్నాను. దయచేసి వెంటనే సహాయం చేయండి. దీనికి MoPNG ఇ-సేవ ప్రత్యుత్తరం ఇచ్చింది. దానిని ట్వీట్ చేసింది. అందులో ఇలా పేర్కొంది.

  • దయచేసి వెంటనే సిలెండర్ సెక్యూరిటీ  క్యాప్ బిగించండి.
  • తరువాత ఆ సిలెండర్ ను బహిరంగ ప్రదేశంలో ఉంచండి
  • ఆ తరువాత మీరు 1906 నెంబర్ కు కాల్ చేయండి. మీ సమస్య చెప్పండి.

మీరు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.. దానికోసం ఇలా చేయాలి..

  • మీ 16 అంకెల LPG ID
  • మీ గ్యాస్ ఏజెన్సీ పేరు
  • జిల్లా
  • ప్రాంతం
  • మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ వీటిని 1906కి మెసేజ్ చేయండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది.

వినియోగదారునికి MoPNG e-Seva ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సమాధానం ఇక్కడ మీరు చూడొచ్చు..

గ్యాస్ సిలిండర్ లీక్ అయితే, ఈ విషయాలను గుర్తుంచుకోండి

  • గ్యాస్ వాసన వస్తే, భయపడవద్దు. వంటగదిలో.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌లను ఆన్ చేయవద్దు.
  • వంటగది, ఇంటి కిటికీలు, తలుపులు తెరవండి.
  • రెగ్యులేటర్ ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ ఆన్ లో ఉంటె వెంటనే దాన్ని ఆఫ్ చేయండి.
  • రెగ్యులేటర్‌ని ఆపివేసిన తర్వాత కూడా రెగ్యులేటర్‌ని తీసి సేఫ్టీ క్యాప్ ని పెట్టండి.
  • నాబ్‌ను కూడా బాగా తనిఖీ చేయండి.
  • వెంటనే మీ డీలర్‌ను సంప్రదించి, పరిస్థితిని గురించి అతనికి తెలియజేయండి. తద్వారా అతను మీకు త్వరగా చేరుకోవచ్చు.
  • గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవడానికి.. రెగ్యులేటర్ అదేవిధంగా గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. పైపు కొంచెం చెడిపోయినట్లయితే, వెంటనే దాన్ని మార్చండి.
  • విక్రేత నుండి గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నప్పుడు.. దానిని పూర్తిగా తనిఖీ చేయండి. ఒకవేళ అది లీక్ అవుతుంటే దాన్ని అప్పుడే దానిని మార్చమని కోరండి.

ఇవి కూడా చదవండి: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

SSC Recruitment 2021: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు అంటే..

Ration Card: ఆరు నెలలకుపైగా రేషన్ తీసుకోవడం లేదా.. మీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి..

Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..