Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి

తెలంగాన రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు.. పేద ప్రజలను ఆదుకునే నాయకుడు. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి
Motkupalli
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2021 | 2:02 PM

Motkupalli on CM KCR: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు.. పేద ప్రజలను ఆదుకునే నాయకుడు. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లోని బాబు జగ్జివన్ రావు.. అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు మోత్కుపల్లి. అనంతరం ఆయన తెలంగాణ భవన్ కు బయల్దేరి వెళ్లారు. మోత్కుపల్లి వెంట ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ఇతర కార్యకర్తలు ఉన్నారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. “ముఖ్యంగా ఇవాళ సంతోషకరమైన దినం. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చుతున్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రిలను చూశా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ని చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను అప్పుల బారి నుండి లేకుండా రైతు ను రాజు చేసేందుకు రైతు బంధు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.” అని మోత్కుపల్లి అన్నారు.

“రైతులకు ఒక్కరికే కాదు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పేదలకు అండగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నా.” అని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.

Read also: Badvel: బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్ట‌ర్ సుధ‌కు వింత అనుభవాలు.. ప్రతీ వీధిలో సంచలన ప్రకటనలు చేస్తున్న ఓటర్లు.!