Yadadri – CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. పునః ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్..
యాదాద్రి పునః ప్రారంభ తేదీని రేపు ప్రకటించబోతున్నారు సీఎం కేసీఆర్. రేపు యాదాద్రిలో పనుల పరిశీలన తర్వాత ప్రకటిస్తారు. రేపు ఉదయం యాదాద్రి వెళతారు ముఖ్యమంత్రి.
యాదాద్రి పునః ప్రారంభ తేదీని రేపు ప్రకటించబోతున్నారు సీఎం కేసీఆర్. రేపు యాదాద్రిలో పనుల పరిశీలన తర్వాత ప్రకటిస్తారు. రేపు ఉదయం యాదాద్రి వెళతారు ముఖ్యమంత్రి. మహా సుదర్శన యాగం వివరాలను అక్కడే ప్రకటిస్తారు సీఎం కేసీఆర్. దివ్యక్షేత్ర నిర్మాణ పనులను ఇప్పటికే పలుమార్లు పరిశీలించారు సీఎం. మంగళవారం మరోసారి పర్యవేక్షిస్తున్నారు. అక్కడే తేదీని ప్రకటించనున్నారు. కేసీఆర్.. తెలంగాణ సీఎం అయ్యాక.. యాదాద్రిపై ప్రత్యేకంగా దృష్టి ఫోకస్ పెట్టారు. పెద్ద మొత్తంలో నగదు కేటాయించి ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్నారు.
కొత్తగా ఆలయంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నభూతో నా భవిష్యత్. తిరుమలకు తీసిపోని విధంగా.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి పునర్ నిర్మాణం జరగాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా పనులు, అంతకు మించిన నిధులతో యాదాద్రి కొత్తగా మారింది. యాదాద్రిలో అత్యంత భారీ రోడ్ల నిర్మాణం అక్కడి అభివృద్ధిని మనకు స్పష్టం చేస్తోంది. యాదాద్రి పునర్నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సప్తగోపురాలతో రూపుదిద్దుకున్న ఆలయ నగరి వైభవం చూడటానికి రెండు కళ్లు చాలవు. దాదాపు పూర్తయిన ఈ మనోహరమైన ఆలయ నిర్మాణం.
పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకత చాటుకోబోతోందన్న సీఎం. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నారు. పున: ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని… వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేలా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: Business Ideas: బిజినెస్ మొదలు పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ ఐడియా మీ కోసమే.. చిన్న పెట్టుబడితో లక్షలు సంపాధించండి..
Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..