Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..

ఆచార్య చాణక్యుడు అనుసరించిన విధానాలు.. తాను రచించిన పుస్తకాలు ఇప్పటికీ అనుసరణీయమే అని పరిశోధకులు అంటున్నారు. అటు మానవ సంబంధాల్లో కాని..

Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..
Acharya Chanakya
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 18, 2021 | 8:22 AM

ఆచార్య చాణక్యుడు అనుసరించిన విధానాలు.. తాను రచించిన పుస్తకాలు ఇప్పటికీ అనుసరణీయమే అని పరిశోధకులు అంటున్నారు. అటు మానవ సంబంధాల్లో కాని.. ఇటు ఆర్ధిక సూత్రాల్లో కూడా ఆచార్యుడు చెప్పినవాటిని అనుసరిస్తున్నారు. మునుపటి కాలంలో ఎలా ఉన్నాయో నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, వ్యూహకర్త  అంతే కాదు గొప్ప రాజకీయవేత్త.. అతని విధానాల కారణంగా చంద్రగుప్త మౌర్య మగధ చక్రవర్తి అయ్యాడు. అతను తెలివితేటలకు ప్రసిద్ధి. ఆయనకు రాజకీయాలలో అనుసరించాల్సిన వ్యూహం తెలుసు. అలా తనకు తెలిసి విషయాలను పుస్తక రూపం ఇచ్చారు చాణక్యుడు.

ఆచార్య చాణక్యుడు మొత్తం సమాజంలోని ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమే నీతిని రూపొందించారు. ఎవరైతే ఆచార్యుడి విధానాన్ని పాటిస్తారో వారు విజయ శిఖరాలను చేరుకుంటున్నారు. అతను తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అంతే కాదు తన కుటుంబంతో సంతోషంగా, సంపన్నంగా జీవిస్తుంటాడు.

అయితే, నేటి పరిస్థితితుల్లో ప్రజలు చాలా అరుదుగా ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరిస్తున్నారు. నేటి రన్-ఆఫ్-ది-మిల్లు జీవితంలో ప్రజలు తమ జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి.. ఆచార్య విధానాలను అనుసరించడం ద్వారా వారి జీవితాన్ని కొనసాగించడానికి కొంచెం కూడా సమయం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో విజయం, ఓటమి అనే పదాలకు అర్థం లేకుండా పోతోంది. నేటి తరంవారికి తెలిసిందల్లా పని చేసకుంటూ పోవడం మాత్రమే.. ఫలితం అదే వస్తుందిలే అని గుడ్డిగా ముందుకు వెళ్లడం.

అయితే, అలా చేసేవారు చివరలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మనం చాణక్యుడి విధానాలను అనుసరిస్తే జీవితంలో విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు.

ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి..

ధర్మం, పరిత్యాగం

ప్రతి వ్యక్తి ఎలాంటి డబ్బను ఆర్జించాలి..? ఎలాంటి ధనం జీవితంలో సంపాధించాలి..? ఆచార్య చాణక్యుడు ధనం ఆర్జనపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ అలాంటి డబ్బు సంపాదించకుండా ఉండాలని దాని కోసం అతను ధర్మం వదులుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. మీరు మోసం ద్వారా డబ్బు సంపాదిస్తే అది మీరు సమస్యల్లో ఉన్న సమయాల్లో పనిచేయదు. దీనితో పాటు మీ గౌరవం కూడా దెబ్బతింటుంది.

శత్రువు ముఖస్తుతి

చాణక్యుడు ముఖస్తుతి ద్వారా సంపాదించిన సంపద పూర్తిగా పనికిరానిదని నమ్ముతారు. ఎందుకంటే అలాంటి సంపదను పొందడం ద్వారా ఎవరైనా ఎప్పుడూ అవమానాన్ని భరించాల్సి ఉంటుంది.

చిత్రహింసలకు గురవుతారు

ఆచార్య చాణక్యుడు చెప్పినదాని ప్రకారం ఎవరైనా అలాంటి సంపదను సంపాదించకుండా ఉండాలో చెప్పారు. ఒకరిని హింసించి ఆర్జించే సంపాదన ఎన్నికటీ ఉపయోగ పడదని… దాని కోసం అతను ప్రతిరోజూ ఒకరిని హింసించాల్సి ఉంటుందని.. అటువంటి డబ్బు సంపాదించడం ద్వారా ఆ వ్యక్తి శారీరక, మానసిక బాధలను భరించాల్సి ఉంటుందని అంటారు ఆచార్య చాణక్యుడు.

గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఇక్కడ రాయడం జరిగింది.

ఇవి కూడా చదవండి:  Karonda Benefits: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే కరోండా తినాల్సిందే.. ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు మరి..!