Only for Hindus: వివాదంలో జాబ్ నోటిఫికేషన్.. హిందువులు మాత్రమే అప్లై చేసుకోమని కోరుతున్న సంస్థ
College Job Notification-Only for Hindus: ఓ హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఆసక్తి,..
College Job Notification-Only for Hindus: ఓ హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఆసక్తి, అర్హత ఉన్న హిందువులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో ఈ జాబ్సం నోటిఫికేషన్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అక్టోబర్ 13న హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ప్రకటనలో అరుల్మిగూ కపలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే కండిషన్స్ అప్లై అంటూ.. కేవలం ఈ పోస్టులకు హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.
ఇదే విషయంపై అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ మాజీ ప్రెసిడెంట్ కే.పాండ్యన్ స్పందిస్తూ.. హెచ్ఆర్ & సీఈ డిపార్ట్‌మెంట్ కు చెందిన 36స్కూల్స్, ఐదు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. ఈ సంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్యుట్ చేసుకుంటున్నామని… అందుకోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేశామని చెప్పారు . అయితే ఈ పోస్టులకు హిందువులు మాత్రమే అర్హులని .. తెలిపారు. ఇలా ప్రకటించడం ఇదే మొదటి సారని.. తమకు ఇతర మతస్థులను కించపరిచే ఉద్దేశ్యం లేదని.. చెప్పారు.
ఇక ఈ సంస్థ త్వరలో మరో నాలుగు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందుకోసమే టీచింగ్ లో డిగ్రీ సైన్స్, మేథ్స్, కామర్స్, లాంగ్వేజెస్, , ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, లైబ్రేరియన్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మ్యాన్, స్వీపర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Also Read: మహిళపై అత్యాచారయత్నం.. హత్య చేసిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు..ఎక్కడంటే ఎక్కడంటే