Indian Railways: రైళ్లలో ఏ లగేజీని తీసుకెళ్లవచ్చు.. ఏ లగేజీని తీసుకెళ్లకూడదో మీకు తెలుసా?.. అయితే తప్పకుండా తెలుసుకోండి..
Indian Railways: ప్రజలు రైలులో ప్రయాణించేప్పుడు చాలా మంది ప్రయాణికులు తమతో ఎలాంటి లగేజీని అయినా తీసుకెళ్లవచ్చని అనుకుంటారు.
Indian Railways: ప్రజలు రైలులో ప్రయాణించేప్పుడు చాలా మంది ప్రయాణికులు తమతో ఎలాంటి లగేజీని అయినా తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. ఆ క్రమంలోనే ప్రజలు తమతో చాలా వస్తువులను తీసుకువెళతారు. ఇందులో గృహోపకరణాల నుండి అనేక ఇతర వస్తువులు ఉంటాయి. కానీ మీకు తెలుసా.. ఇలా చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. రైల్వే నిబంధనల ప్రకారం.. ట్రైన్‌లో కొన్ని రకాల వస్తువులను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లలేరు. ఫ్లైట్ మాదిరిగానే.. రైలుకు కూడా బరువుకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి. దీని ప్రకారం.. ఏ ప్రయాణికులు అయినా పరిమిత మొత్తంలోనే లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ట్రైన్‌లో ప్రయాణికులు తమలో ఏం తీసుకెళ్లవచ్చు.. ఎంత బరువు లగేజీని తీసుకెళ్లవచ్చు.. వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ వస్తువులను తీసుకువెళ్లకూడదు.. రైలులో తీసుకోకూడని వస్తువుల జాబితా చాలా పెద్దగానే ఉంది. రైలులో పేలుడు పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులు, మంట కలిగించే పదార్థాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, యాసిడ్ వంటి వస్తువులను ఎవరూ తీసుకెళ్లకూడదు. వీటితో పాటు.. స్కూటర్లు, సైకిళ్లు, బైక్‌లను తీసుకెళ్లకూడదు. ప్రయాణికులు ఎవరైనా తమ పెంపుడు జంతువులను తమతో తీసుకెళ్లాలనుకుంటే.. తమతో పాటు వాటికి కూడా ప్రత్యేక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆ పెంపుడు జంతువులను తమతో సీట్లలో కూర్చోబెట్టుకోలేరు. బ్రేక్ వ్యాన్‌లో పెడతారు. అలాగే.. వ్యాపార సంబంధిత వస్తువులను సైతం తీసుకెళ్లడం నిషేధించడం జరిగింది.
ఏం తీసుకెళ్లవచ్చు.. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రంక్, సూట్‌కేస్, బాక్స్ మీతో తీసుకెళ్లవచ్చు. అయితే, 1000 సెం.మీ. x 60 సెం.మీ x 25 సెం.మీ కంటే ఎక్కువ పరిమాణం ఉండకూడదు. రైలులో గ్యాస్ సిలిండర్లు నిషేధించబడినప్పటికీ.. వైద్య సంబంధిత అంశాల్లో ప్రయాణీకులు తమతో పాటు మెడికల్ సిలిండర్లను తీసుకెళ్లవచ్చు.ఆక్సిజన్ సిలిండర్ల కోసం రైల్వే శాఖ అనేక సౌకర్యాలు ఇవ్వడం జరిగింది.
ఇతరుల టికెట్‌పై ప్రయాణించవచ్చు.. వేరొకరి టికెట్‌పై ప్రయాణించలేరని విషయం తెలిసిందే. అయితే, కుటుంబానికి సంబంధించి వేరే నియమం ఉంది. కుటుంబ సభ్యుడు టిక్కెట్‌పై ప్రయాణించవచ్చు. అయితే, మీరు ఎవరి టిక్కెట్‌పై ప్రయాణిస్తున్నారో వారితో మీకు రక్త సంబంధం ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు.. తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే, మీరు వారి టికెట్‌లో ప్రయాణించవచ్చు. కానీ, దీని కోసం ప్రత్యేక టికెట్ జారీ చేయబడుతుంది.
Also read:
Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే..
Aadhaar Card: ఆధార్ సమస్యలకు చెక్ చెప్పండి.. ఇప్పుడు నిమిషాల్లో ఇ-ఆధార్ పొందండి.. అదెలాగంటే..!