AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karonda Benefits: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే కరోండా తినాల్సిందే.. ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు మరి..!

Health Care Tips: చాలా తక్కువ మంది కరోండా తింటారు. ఇది సాధారణంగా చాలా పులుపు, ఘాటుగా ఉండే లోకల్‌గా లభించే పండు.

Karonda Benefits: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే కరోండా తినాల్సిందే.. ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు మరి..!
Karonda
Venkata Chari
|

Updated on: Oct 18, 2021 | 8:17 AM

Share

Health Benefits Of Karonda: చాలా తక్కువ మంది మాత్రమే కరోండా తింటారు. ఇది సాధారణంగా చాలా పులుపు, ఘాటుగా ఉండే ఒక స్థానికంగా లభించే పండు. భారతదేశంలో కారోండా సాధారణంగా మసాలా, ఊరగాయల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పండు పరిమాణంలో చాలా చిన్నది. కానీ, ఉపయోగాలు మాత్రం చాలా పెద్దవి. కరోండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

కరోండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: గుండె కండరాలు బలోపేతం: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కారొండా రసం తాగాలి. గుండె కండరాలను బలోపేతం చేయడానికి, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచడానికి వారానికి రెండు లేదా మూడు సార్లు ఒక గ్లాసు కరోండా పండ్ల రసాన్ని తప్పక తీసుకోవాలి.

జ్వరం నుంచి తక్షణ ఉపశమనం: పండ్లలో తగినంత మొత్తంలో ఉండే విటమిన్ సీ తో పాటు, కరోండా చాలా కాలంగా జ్వరం చికిత్సకు ఉపయోగించే పదార్థాల్లో ఒకటి. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో, ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో కరోండా సహాయపడుతుంది. పండిన లేదా ఎండిన కారోండా తినడం వల్ల జ్వరాన్ని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో..: కరోండాను మీ ఆహారంలో చేర్చితే, మీ బరువును తగ్గించడంలోనూ ఎంతో సహాయం చేస్తుంది. ఏ రూపంలో తిన్నా, పొట్ట చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. మరోవైపు, మీరు కరోండా రసాన్ని క్రమం తప్పకుండా తాగితే, అది బరువు తగ్గించడంలో మీకు తప్పకుండా సహాయపడుతుంది.

రక్తహీనతకు చెక్: రక్తహీనత ఉన్న రోగులకు కరోండా గొప్ప ప్రయోజనాలను తెస్తుందని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, తరచుగా కరోండా తినమని నిపుణులు సలహా కూడా ఇస్తున్నారు.

Also Read: Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!