Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Women Health Tips: ప్రస్తుతం అనేక మంది మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పోషకాహారంలో లోపం ఉండటం, మానసిక ఆందోళన, ఇతర ఒత్తిళ్లు..

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2021 | 5:52 PM

Women Health Tips: ప్రస్తుతం అనేక మంది మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పోషకాహారంలో లోపం ఉండటం, మానసిక ఆందోళన, ఇతర ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. స్త్రీలకు పోషకాహారం అందడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ఎంతో ముఖ్యమని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు తీసుకుంటే ఎంతో మేలంటున్నారు. అవేంటో చూద్దాం.

పాలకూర:

పాలకూరలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. పాలకూరను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి ఎంతగానో సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. పాలకూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

బాదం:

బాదం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి.. స్లిమ్‌గా తయారయ్యేందుకు దోహదపడతాయి. బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గుండె సంతోషంగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తినండి… గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పప్పు దినుసులు:

పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రోటీన్లు అందించడంలో వీటి పాత్ర ఎంతో ఉంటుంది.ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలకు మెదడును చురుకుదనం ఉంచడమే కాకుండా మరెన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి.

ఓట్స్‌:

ఓట్స్‌ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి.

బ్రోకోలీ:

మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది.

పాలు:

పాలతో మహిళలకు పాల ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎముకలను పటుత్వం చేసి ఎముకల నిర్మాణంలో ఎంతగానో సహాయపడతాయి. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్‌ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో లభిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం లేదా నిద్ర విరామాలు వంటి సమస్యలు ఉంటే, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు సాధారణ ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని పాలు తీసుకోవడం మంచిది. పాలు మరియు పాల ఉత్పత్తులు ప్రోటీన్ యొక్క మంచి వనరులు. ప్రోటీన్ బరువు తగ్గడానికి అదేవిధంగా బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే పోషకాలు కడుపు నిండుగా ఉంచుతాయి.

ఇవీ కూడా చదవండి:

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

Vaccine: ఏయే వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు.. ఎంతో మంది మరణిస్తున్నా.. తయారు కానీ టీకాలు!

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!