Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid: థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది.. వస్తే బరువు పెరుగుతారా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

ప్రస్తుతం ప్రతి పది మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లే స్త్రీలు ఒత్తిడికి గురవుతారు...

Thyroid: థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది.. వస్తే బరువు పెరుగుతారా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
Thyrod
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 17, 2021 | 5:32 PM

ప్రస్తుతం ప్రతి పది మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లే స్త్రీలు ఒత్తిడికి గురవుతారు. దాంతో పాటు రుతుచక్రం, గర్భధారణ.. వంటి కారణాల వల్ల కూడా వారిలో హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేదా హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోవడం. మన ఆహార అలవాట్లలో సరైన మార్పులు చేసుకుని మందులు సరిగ్గా తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. మెడ భాగంలో ముందువైపు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్​ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్​ శరీరంలోని ప్రతి కణంపైనా తన ప్రభావాన్ని చూపి ఎన్నో పనులు సవ్యంగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్​ హార్మోన్​ ఉత్పత్తి ఎక్కువ, తక్కువ కాకుండా తగినంత ఉండాలి. అలా జరగనప్పుడు దాని పనితీరులో లోపాల వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. థైరాయిడ్ సమస్యతో బురువు పెరుగే అవకాశం ఉంటుంది.

అవసరమైన దాని కంటే.. థైరాయిడ్​ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే దాన్ని హైపర్​ థైరాయిడిజమని, సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్​ హార్మోన్​ఉత్పత్తి అయితే దాన్ని హైపో థైరాయిడిజమని అంటారు. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో ప్రతి అవయవానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. హైపో థైరాయిడిజం వల్ల హార్మోన్ లోపించి జీవక్రియలు దెబ్బతింటాయి. ఆ కారణంగా శరీర బరువు పెరుగుతుంది. థైరాయిడ్​ ట్యాబ్లెట్స్ వాడటం ద్వారా ఈ సమస్యను అధికమించవచ్చు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కాకుండా గాయిటర్, థైరాయిడ్ నోడ్యూల్స్, థైరాయిడ్ క్యాన్సర్ వంటి సమస్యులు కూడా ఉంటాయి.

హైపోథైరాయిడిజం ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పు, అవిసె గింజలు, చిక్కుళ్లు, ఆలివ్ నూనె, గుడ్లు, పాలు, పీచు పదార్ధాలు ఉన్న ఆహరం, చేపలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్లు, కాలీఫ్లవర్ మరియు ముల్లంగి వంటి ఆకుపచ్చ కూరగాయలను తినొచ్చు. సలాడ్లు ముఖ్యంగా టమోటాలు, దోసకాయలు మరియు క్యాప్సికమ్ తో చేసిన సలాడ్లు తినవచ్చు. కాలానుగుణ పండ్లను తినడం మంచిది. ఆయా సీజన్లలో లభించే పండ్లు అంటే మావిడి, జామకాయలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి.

Read Also..Women Health Benefits: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!