Too much Coffee: కాఫీ అధికంగా తాగుతున్నారా…? అయితే ఇది మీకోసమే…! (వీడియో)

కాఫీ అంటే చాలా మంది ఇష్టపడతారు..అలసట లేకుండా పనిచేయాలన్నా, ఉత్సాహం, ఉత్తేజంగా ఉండాలన్నా కాఫీని సేవించాల్సిందే. ముఖ్యంగా నైట్ షిప్టు లో పనిచేసేవారికి కాఫీ చాలా సహాయకారి. అయితే చాలా మంది కాఫీని ఎప్పుడుపడితే ....

Too much Coffee: కాఫీ అధికంగా తాగుతున్నారా...? అయితే ఇది మీకోసమే...! (వీడియో)

|

Updated on: Oct 18, 2021 | 11:49 AM

కాఫీ అంటే చాలా మంది ఇష్టపడతారు..అలసట లేకుండా పనిచేయాలన్నా, ఉత్సాహం, ఉత్తేజంగా ఉండాలన్నా కాఫీని సేవించాల్సిందే. ముఖ్యంగా నైట్ షిప్టు లో పనిచేసేవారికి కాఫీ చాలా సహాయకారి. అయితే చాలా మంది కాఫీని ఎప్పుడుపడితే అప్పుడు కప్పులు కప్పులు లాగించేస్తారు. దీని వల్ల మాత్రం చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. కాఫీని అధికమొత్తంలో తాగడం అది చేసే మేలు తక్కువై, కీడే ఎక్కువవుతుంది. ఇది ఆల్కాహాల్ కన్నా హానికరం కావచ్చు. అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అప్పుడు ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అంటున్నారు వైద్యులు.

కాఫీ అధికంగా తాగేవారిలో మానసిక ఆందోళన పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పెంచుతుంది. ఇది నియంత్రణలో ఉన్నంత మేరకు ఆరోగ్యానికి మంచిదే. అధికంగా కెఫీన్ ఒంట్లో చేరడం వల్ల మెదడులో ఉండే అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల మీకు అలసటగా అనిపిస్తుంది. ఆందోళన పెరుగుతుంది. రాత్రి షిప్టుల్లో పనిచేసేవారు సాయంత్రం ఒక కాఫీ తాగితే చాలు, రాత్రి నిద్రరాకుండా పనిచేసుకోగలరు. అలాంటిది ఉదయం నుంచి ఆరేడు కప్పుల కాఫీ తాగే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రాత్రిపూట నిద్ర సరిగా పట్టక పోవడం వల్ల, కొన్నాళ్లకు అది ఇన్సోమ్నియాగా మారిపోతుంది. కాఫీ నిద్ర షెడ్యూల్ మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తుంది. 
ఏదైనా వ్యసనంగా మారితే దాని వల్ల నష్టమే. రోజూ అయిదారు కప్పులు మించి కాఫీ తాగే వాళ్లలో కొన్నాళ్లకి ఇది ఆల్కహాల్ లాగే భయంకరమైన వ్యసనంగా మారిపోతుంది. ఇక కాఫీ తాగకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ ఒకరకమైన కొకైన్ లాంటిదే. ఇది మెదడు రసాయనాలను తీవ్రంగా వశపరచుకుని, వ్యసనంగా మార్చేస్తుంది. ఖాళీ కడుపుతో పరగడుపునే కాఫీ తాగడం మంచిది కాదు. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రేరేపిస్తుంది. కెఫీన్ శక్తినిస్తుందనే నిజమే కానీవ, అధికమొత్తంలో చేరిన కెఫీన్ అలసటకు కారణమవుతుంది. కాఫీ రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడం మంచిది. ఈ రెండు కప్పులు చాలు మీకు ఉత్సాహాన్నివ్వడానికి. ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక కాఫీ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమంటున్నారు నిపుణులు.

మరిన్ని చదవండి ఇక్కడ: Women Die with Egg: మహిళ ప్రాణం తీసిన కోడి గుడ్డు..! నాగర్‌ కర్నూలు జిల్లాలో విషాద ఘటన (వీడియో)

Elephant Viral Video: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఏనుగు వీడియో.. అసలేం చేసిందంటే..?

Rare Sothari Video: మత్స్యకారుల వలలో అరుదైన సోఠారి..వేలల్లో ధర..! ఆ చేప స్పెషాలిటీ ఏంటంటే..?(వీడియో)

Jeff Bezos Blue Origin: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన నటుడు.! బ్లూ ఆరిజిన్​ ద్వారా అంతరిక్షయానం విజయవంతం.. (వీడియో)

Follow us