AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..

Health Benefits: కడుపులో, కాలేయంలో, పేగుల్లో ఎలాంటి సమస్య ఉన్నా.. బొప్పాయి పండు తింటే చాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం..

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..
Papaya
Shiva Prajapati
|

Updated on: Oct 18, 2021 | 6:30 AM

Share

Health Benefits: కడుపులో, కాలేయంలో, పేగుల్లో ఎలాంటి సమస్య ఉన్నా.. బొప్పాయి పండు తింటే చాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం ద్వారా తీవ్రమైన ఉదర సమస్యల నుంచి బయటపడొచ్చునని పేర్కొంటున్నారు. బొప్పాయి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందట. దాని ఆకులు, మూలాలు, కాండం, విత్తనాలతో శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయవచ్చునట. బొప్పాయితో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఇ, ఎ సహా అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తాయి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ కూడా తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. 1977 లో, లండన్ ఆసుపత్రిలో మూత్రపిండాల ఆపరేషన్ తర్వాత, బొప్పాయి వాడకంతో ఇన్ఫెక్షన్ వేగంగా తొలగించబడిందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు అప్పట్లో లండన్ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ప్రతీ వార్తా పత్రికలో ప్రముఖంగా దీని గురించి వార్తను ప్రచురించారు. ఇక దక్షిణాఫ్రికాలో ప్రజలు పుండ్లు, గాయాలకు చికిత్స చేయడానికి బొప్పాయి గుజ్జును ఉపయోగిస్తారు. ఆ గుజ్జును కట్టుగా కట్టడం వల్ల గాయాలు మానిపోతాయట. అందుకే అక్కడి ప్రజలు బొప్పాయిని బంగారు పండు అని, ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండుగా పరిగణిస్తారు.

ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో.. బొప్పాయి పండు జీవక్రియను మెరుగు పరుస్తుంది. కఠినమైన ఆహార పదార్థాలను సైతం సులభంగా జీర్ణిం చేయగల సామర్థ్యం బొప్పాయి ప్రత్యేకత. ఇది ఇతర పండ్ల కంటే భిన్నమైనది. బొప్పాయి విత్తనాలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. దంతాలు, ఎముకల వ్యాధుల నివారణకు ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి రాస్తే, ముఖం మెరుస్తూ ఉంటుంది.

స్కర్వి చికిత్స విటమిన్ సి లోపం వల్ల స్కర్వి వ్యాధి వస్తుంది. ప్రఖ్యాత పర్యాటకుడు మార్కోపోలో, అతని సహచరులు దంతాలు, ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా.. బొప్పాయి సహాయంతో వారందరికీ చికిత్స అందించారు. దాంతో వారు తమ సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందారు.

Also read:

Head Constable: పట్టపగలే డ్యూటీలో ఉండగా మందు తాగుతున్న పోలీస్.. రూల్స్ వీళ్ళకి వర్తించవా అంటున్న జనం

Viral News: భార్య, భర్తలిద్దరూ ఒకే భాష మాట్లాడొద్దు.. ఈ వింత సంస్కృతి ఎక్కడ ఉందంటే..!

Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..