Viral News: భార్య, భర్తలిద్దరూ ఒకే భాష మాట్లాడొద్దు.. ఈ వింత సంస్కృతి ఎక్కడ ఉందంటే..!

Viral News: సాధారణంగానే భార్య, భర్తలు ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటారు. అస్సలు ఒక పట్టాన ఒకరి మాట మరొకరు వినని పరిస్థితి ఉంటుంది.

Viral News: భార్య, భర్తలిద్దరూ ఒకే భాష మాట్లాడొద్దు.. ఈ వింత సంస్కృతి ఎక్కడ ఉందంటే..!
Languages
Follow us

|

Updated on: Oct 18, 2021 | 4:24 AM

Viral News: సాధారణంగానే భార్య, భర్తలు ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటారు. అస్సలు ఒక పట్టాన ఒకరి మాట మరొకరు వినని పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఒక కుటుంబంలో రెండు మూడు భాషలు మాట్లాడేవాళ్లు ఉండటం చూసుంటాం. ఒకరు ఓ భాషలో ఏదైనా చెప్తే దానికి ఇంకొకరు మరో భాషలో సమాధానం చెప్తుంటారు. ఇదంతా ప్రతిరోజూ మనం చూసేదే. కానీ మహిళలకు ఒక భాష, పురుషులకు ఒక భాష ఉండటం ఎక్కడైనా చూశారా?.. పోనీ విన్నారా?.. అయితే ఇప్పుడు ఈ వింత సంస్కృతి గురించి తెలుసుకోండి. అక్కడ స్త్రీ పురుషులు వేర్వేరు భాషల్లో మాట్లాడతారు. పురుషుడు మాట్లాడిన భాషలో స్త్రీ మాట్లాడకూడదట. స్త్రీ మాట్లాడిన భాషలో పురుషుడు మాట్లాడకూడదట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమండి బాబూ.. మరి ఈ వింత వ్యవహారం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం పదండి..

నైజీరియా అడవుల్లో నివసించే ఓ ఆటవిక తెగ ప్రజలకు రెండు భాషలున్నాయి. ఈ తెగలోని స్త్రీలకు వేరే భాష, పురుషులకు వేరే భాష ఉంది. పురుషులు మాట్లాడిన భాషలో స్త్రీలు పొరపాటున కూడా మాట్లాడకూడదు. అంతేకాదు వారి లిపులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తరతరాలుగా వారు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. మరి, ఆ ప్రాంత ప్రజలు జీవనం ఎలా సాగిస్తున్నారు? అక్కడ స్త్రీలు.. స్త్రీలతో, పురుషులు పురుషులతో తప్ప స్త్రీపురుషులు ఒకరితో మాట్లాడుకోరా అంటే పొరబాటే. ఎందుకంటే ఇద్దరికీ రెండు భాషలూ తెలుసు. చక్కగా ఇద్దరూ తమతమ భాషల్లో మాట్లాడుకుంటారు. అలా స్త్రీ పురుషులు వేర్వేరు భాషల్లో మాట్లాడటం వారి సంప్రదాయమట. కేవలం వారి పిల్లలకు తప్ప, మరో తెగకు కానీ, సమాజంలో మరెవరికైనా గానీ వారి తమ భాషలను నేర్పించడానికి ఇష్టపడరు. కారణం అక్కడి స్త్రీలు శుక్రగ్రహం నుంచి పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారని, ఇది దైవ రహస్యం అని వారు నమ్ముతారు. విచిత్రంగా ఉన్నా ఇదే నిజం.

Also read:

Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Telangana Fears Tiger: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులులు.. ఏక కాలంలో రెండు పులుల దాడులు..