Head Constable: పట్టపగలే డ్యూటీలో ఉండగా మందు తాగుతున్న పోలీస్.. రూల్స్ వీళ్ళకి వర్తించవా అంటున్న జనం

Head Constable: చట్టాలు. సెక్షన్లు. రూల్స్. ఇవన్నీ ప్రజల కే కానీ మాకు కాదని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చేస్తాం మమ్మల్ని నిలదీసే వారు ఎవరినే ధీమా నగర..

Head Constable: పట్టపగలే డ్యూటీలో ఉండగా మందు తాగుతున్న పోలీస్.. రూల్స్ వీళ్ళకి వర్తించవా అంటున్న జనం
Head Constable
Follow us
Surya Kala

|

Updated on: Oct 18, 2021 | 6:09 PM

Head Constable: చట్టాలు. సెక్షన్లు. రూల్స్. ఇవన్నీ ప్రజల కే కానీ మాకు కాదని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చేస్తాం మమ్మల్ని నిలదీసే వారు ఎవరినే ధీమా నగర పోలీసుల తీరును అద్దంపట్టే ఈ సంఘటన ఇది….ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ బాసే…ఇలా పట్ట పగలు ఫుల్‌గా మద్యం సేవిస్తున్న ఘటన పై పలువురు మండి పడుతున్నారు…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో ఇటీవలనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మందుబాబుల పై పోలీసులతో విరగబడి జరిమానాలతో ప్రతాపం చూపిస్తున్నారు. అయితే పోలీసులే పోలీస్ బాస్(ఏస్పీ)ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న… ఈ దృశ్యం సాక్ష్యంగా నిలుస్తుంది….నిన్న మొన్నటి వరకు ఏ.ఆర్.గ్రౌండ్స్ గా ఉన్న స్థలంలో సెంట్రల్…. సౌత్ మండలాల డీఎస్పీల కార్యాలయాలు, దిశా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో ఒక హెడ్ కానిస్టేబుల్ పట్టపగలే మందు కొట్టడం పోలీస్ బాస్ ఆదేశాలు బేఖాతర్ చేసి మద్యం సేవిస్తున్న వైనాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారులు ఇంటికే పరిమితం అవ్వడంతో కింది స్థాయి సిబ్బంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి……

రాత్రి సమయాలలో ఎలా ఉన్నా, యూనిఫారం వేసుకొని, పట్టపగలు ఆన్ డ్యూటీ లో మందు కొట్టిన ఈ హెడ్ కానిస్టేబుల్ పై రూల్స్ వర్తిస్తాయా? రక్షక కార్యాలయంలోనే ఉన్నత అధికారులు ఉన్న సమయంలో ఓ పోలీసు సిబ్బంది మద్యం సేవించడం వెనక ఆంతర్యం ఏంటి.? అసలు ఉన్నతాధికారులు సమయపాలన పాటిస్తున్నారు ప్రజల సమస్యలను కాకుండా కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు .? సొంత వాడని వదిలేస్తారా?…..వేచి చూడాలి..

Also Read:

సందడిగా ‘అలయ్ బలయ్’.. మనదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇటువంటి కార్యక్రమాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య