SSC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు అంటే..
SSC Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)..
SSC Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,261 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించగా, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఫేజ్ 9 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు చివరి తేదీ 2021 అక్టోబర్ 25గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే మొత్తం ఖాళీలు 3261 పోస్టులుగా పేర్కొనగా, ఇందులో జనరల్ కోటాలో 1366 పోస్టులు, ఎస్సీ కోటాలో 477 పోస్టులు, ఎస్టీ కోటాలో 249 పోస్టులు, ఓబీసీ కోటాలో 788 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 381 పోస్టులు భర్తీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 2021 సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ 2021 అక్టోబర్ 25గా నిర్ణయించారు. ఇక అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28, ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ 2021 అక్టోబర్ 28, ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 1గా నిర్ణయించారు.
► విద్యార్హతలు: 10+2, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
► దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు.
► వేతనం: రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85, 500 వేతనం.
► పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
► ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..