ALIMCO Recruitment: ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ALIMCO Recruitment 2021: మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌ (అలిమ్‌కో).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాన్పూర్‌లో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో..

ALIMCO Recruitment: ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2021 | 2:59 PM

ALIMCO recruitment 2021: మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌ (అలిమ్‌కో).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాన్పూర్‌లో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులులాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 23 ఖాళీలకు గాను ప్రోస్థటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్‌ (13), ఆడియాలజిస్ట్‌ (10) పోస్టులు ఉన్నాయి.

* ప్రోస్థటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. అలాగే.. స్థానిక భాష వచ్చి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు.

* ఆడియాలజిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనిలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ప్రోస్థటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్‌ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 25,000, ఆ తర్వాత నెలకు రూ.30,000 జీతంగా చెల్లిస్తారు.

* ఆడియాలజిస్ట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.35,000, ఆ తర్వాత నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 03-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pomegranate Leaves: సీజనల్ దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారు.. అయితే దానిమ్మ ఆకులతో ఇలా చేసి చూడండి

Kerala Floods: పెళ్లి కోసం యువ జంట సాహసం.. వరద నీటిలో వంట పాత్రలో ప్రయాణం..

Viral Video: ఏయ్.. ఎవరది.. నన్నే ఆటపట్టిస్తారా.. కోతితో ఆట అమ్మచ్చి.. ఫన్నీ వీడియో వైరల్…

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..