Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పెళ్లి కోసం యువ జంట సాహసం.. వరద నీటిలో వంట పాత్రలో ప్రయాణం..

Kerala Floods: గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రం అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి...

Watch: పెళ్లి కోసం యువ జంట సాహసం.. వరద నీటిలో వంట పాత్రలో ప్రయాణం..
Marriage
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2021 | 4:58 PM

గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రం అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. మల్లపురం, కోజికోడ్, వయనాడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడి 26 మంది గల్లంతయ్యారు.

భారీ వర్షాల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇంతటి వరదలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ధైర్యం చేశారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వరదలోనే వారు కల్యాణ మండపానికి చేరుకున్నారు. పెద్ద అల్యూమినియం వంట పాత్రలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు వివాహ వేదికకు చేరుకున్నారు. సమీపంలోని ఆలయం పక్కనే ఉన్న తలవాడిలో వరదతో నిండిన హాలులోకి ప్రవేశించారు. పరిమిత సంఖ్యలో ఉన్న బంధువుల మధ్య ఐశ్వర్య, ఆకాష్ పెళ్లి చేసుకున్నారు. వారు అల్యూమినియం పాత్రలో వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సోమవారం వివాహం చేసుకోవాలని నిర్ణయించాం. ఇది శుభకార్యమైనందున ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని నూతన జంట తెలిపింది. ఇంకా ఆలస్యం చేయకూడదని భావించామని వారు చెప్పారు. కొన్ని రోజుల క్రితం దేవాలయానికి వచ్చినప్పుడు నీరు లేదని, అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రదేశం జలమయమైందన్నారు. వధువు, వరుడు చెంగనూరులోని ఒక ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నారు.

Read Also.. RattleSnakes: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 పాములు.. ఒకే ఇంటిలో.. వింటేనే భయమేస్తుంది కదు..