RBI Scholarship Scheme 2021: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు గడువు అక్టోబర్‌ 20 వరకే

RBI Scholarship Scheme 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించింది. నెలకు రూ.40 వేల చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది..

RBI Scholarship Scheme 2021: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు గడువు అక్టోబర్‌ 20 వరకే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2021 | 5:23 PM

RBI Scholarship Scheme 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించింది. నెలకు రూ.40 వేల చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా కాలేజీల్లో ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ స్కాలర్‌షిప్స్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తం 5 స్కాలర్‌షిప్స్ ప్రకటించింది ఆర్‌బీఐ. ద్రవ్య, ఆర్థిక శాస్త్రం లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్‌బీఐ సెంట్రల్ ఆఫీస్ లేదా రీజనల్ ఆఫీస్‌లో కొంతకాలం పరిశోధన చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌తో పాటు రీసెర్చ్ పేపర్ విజయవంతంగా పూర్తి చేసినవారికి రూ.1,50,000 పారితోషికం కూడా లభిస్తుంది.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు..

కాగా, ఆర్‌బీఐ ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్‌ను పోస్టులో పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దరఖాస్తు ఫామ్ కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోండి.

► స్కాలర్‌షిప్స్ సంఖ్య- 5

► ప్రాజెక్ట్ కాలం: గరిష్టంగా మూడు నెలలు

► స్కాలర్‌షిప్: నెలకు రూ.40,000 చొప్పున మూడు నెలలు లభిస్తుంది.

► దరఖాస్తుకు చివరి తేదీ: 2021 అక్టోబర్ 20

► స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రారంభం: 2021 డిసెంబర్ 6

► అర్హతలు: ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దరఖాస్తు చేయాలి.

► వయస్సు: 55 ఏళ్ల లోపు

► ఈ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

1. అభ్యర్థులు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్స్‌లో Scholarships పైన క్లిక్ చేయాలి.

2. Scholarship Scheme for Faculty Members from Academic Institutions: 2021 పైన క్లిక్ చేయాలి.

3. Application పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

4. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

5. పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ నింపాలి.

6.- రీసెర్చ్ ప్రపోజల్‌తో 1,000 కన్నా ఎక్కువ పదాలతో కరిక్యులమ్ విటే రూపొందించాలి.

7. ప్రస్తుతం ఫ్యాకల్టీగా పనిచేస్తున్న యూనివర్సిటీ లేదా కాలేజ్ అఫీషియల్ లెటర్ జత చేయాలి.

8. దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Director, Development Research Group, Department of Economic and Policy Research, 7th Floor, Central Office Building, Reserve Bank of India, Fort, Mumbai – 400001

ఇవీ కూడా చదవండి:

Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Shirdi Tour Package: షిర్డీకి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. చార్జీలు ఇవే..

SSC Recruitment 2021: ఇంటర్‌, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు అంటే..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!