Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డిగ్రీ పాసైన వారికి ఉద్యోగ అవకాశాలు.. 7855 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..!

Bank Jobs: ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌..

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డిగ్రీ పాసైన వారికి ఉద్యోగ అవకాశాలు.. 7855 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2021 | 9:20 AM

Bank Jobs: ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7855 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 27 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు.

► మొత్తం పోస్టులు: 7855

► అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి.

► అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

► ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► అప్లికేషన్‌ ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ. 175.

► దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 7, 2021

► దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 27, 2021

► ప్రిలిమ్స్‌ పరీక్ష: డిసెంబర్‌ 2021

► మెయిన్స్‌: వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి

► వెబ్‌సైట్‌:https://www.ibps.in/

ఇవీ కూడా చదవండి:

Infosys Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 45 వేల ఉద్యోగులను తీసుకోనున్న ఇన్ఫోసిస్‌..

Telangana: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. 1654 పోస్టుల భర్తీ..