Infosys Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 45 వేల ఉద్యోగులను తీసుకోనున్న ఇన్ఫోసిస్‌..

Infosys Recruitment: కరోనా సమయంలో మందగించిన ఉద్యోగాల నియాకం ఇప్పుడు మళ్లీ ఊపకుంది. పరిస్థితులు చక్కబడడం, డిమాండ్‌ పెరగడంతో మళ్లీ కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడానికి..

Infosys Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 45 వేల ఉద్యోగులను తీసుకోనున్న ఇన్ఫోసిస్‌..
Infosys Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 13, 2021 | 9:54 PM

Infosys Recruitment: కరోనా సమయంలో మందగించిన ఉద్యోగాల నియాకం ఇప్పుడు మళ్లీ ఊపకుంది. పరిస్థితులు చక్కబడడం, డిమాండ్‌ పెరగడంతో మళ్లీ కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ టెక్నాలజీకి డిమాండ్‌ పెరగడంతో ఐటీ కంపెనీలు నియమాకాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ.. ఇన్ఫోసిస్‌ భారీగా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్‌ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్‌ పెద్ద ఎత్తున ఫ్రెషర్స్‌ను తీసుకోవడానికి సిద్ధమైంది. గతేడాది ఇన్ఫోసిస్‌ 35,000 ఉద్యోగులను తీసుకుంటే ఈ ఏడాది ఏకంగా 45,000 మంది ఫ్రెషర్లను క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా తీసుకోనున్నారు. ఈ విషయమై ఇన్ఫోసిన్‌ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ.. మార్కెట్‌పై పట్టు సాధించడం కోసమే తాము 45,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్లు తెలిపారు.

డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడం, పరిశ్రమలో అట్రిషన్ రేటు పెరగడం వల్ల సవాళ్లు ఎదురు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల అట్రిషన్‌ రేటు కూడా పెరిగింది. గతేడాది అట్రిషన్‌ రేటు 12.8 శాతం ఉంటే ఈ ఏడాది 20.1%గా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి ఇన్ఫోసిస్‌లో 2,79,617 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

Also Read: Corona In Russia: రష్యాలో మరణ మృదంగం.. ఒక్క రోజులో 984 మంది మృతి..

Edible Oil Prices: పండుగలవేళ కేంద్రం శుభవార్త.. దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు!

MS Dhoni: కొత్త పాత్రలో ఎంఎస్ ధోని.. క్రికెట్ అకాడమీ మొదలెట్టిన భారత మాజీ కెప్టెన్.. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!