MS Dhoni: కొత్త పాత్రలో ఎంఎస్ ధోని.. క్రికెట్ అకాడమీ మొదలెట్టిన భారత మాజీ కెప్టెన్.. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

MS Dhoni Cricket Academy: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో కొత్త అవతారం ఎత్తాడు. ఇంతకు ముందు వరకు టీమిండియాలో ఎన్నో పాత్రలు పోషించిన ధోనీ, క్రికెట్‌లోనే మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

MS Dhoni: కొత్త పాత్రలో ఎంఎస్ ధోని.. క్రికెట్ అకాడమీ మొదలెట్టిన భారత మాజీ కెప్టెన్.. ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Ms Dhoni
Follow us

|

Updated on: Oct 13, 2021 | 6:50 PM

MS Dhoni Cricket Academy: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో కొత్త అవతారం ఎత్తాడు. ఇంతకు ముందు వరకు టీమిండియాలో ఎన్నో పాత్రలు పోషించిన ధోనీ, క్రికెట్‌లోనే మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. యువకులకు క్రికెట్ నేర్పించేందుకు ఏకంగా క్రికెట్ అకాడమీనే నెలకొల్పాడు. ఇందులో స్వయంగా క్రికెట్ పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. క్రీడా సంస్థలైన గేమ్‌ప్లే, ఆర్కా స్పోర్ట్స్ భాగస్వామ్యంతో మంగళవారం బెంగళూరులో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (MSDCA)ని ప్రారంభించాయి. ఇది నవంబర్ 7 నుంచి శిక్షణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. “క్రికెట్ అకాడమీని ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. మీ నైపుణ్యాలను పదును పెట్టడానికి అత్యుత్తమ పద్ధతులు, సాంకేతికత సహాయంతో 360 డిగ్రీల శిక్షణా విధానంతో ట్రైనింగ్ అందించడమే లక్ష్యంగా దీనిని స్థాపించాం’ అని ఆయన పేర్కొన్నారు.

” ఇందులో కోచ్‌లు, ఫిట్‌నెస్ నిపుణులు కూడా ఉంటారు. క్రికెట్‌కు అత్యుత్తమ టెక్నాలజీని తోడు చేయనున్నాం. ఇప్పుడే నమోదు చేసుకోండి. నా అకాడమీలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి. ఇది కేవలం క్రికెటర్‌గా మాత్రమే కాదు, తెలివైన వ్యక్తిగా మర్చేస్తాం. మానసిక, శారీరక నైపుణ్యాలను తెలుసుకోవడానికి మాతో చేరండి” అంటూ చెప్పుకొచ్చారు. ధోనీ అకాడమీని బిదరహళ్లిలోని కాడ అగ్రహారంలో ఏర్పాటు చేశారు.

గేమ్‌ప్లే యజమాని దీపక్ ఎస్. భట్నాగర్ మాట్లాడుతూ, ” గేమ్‌ప్లేలో మాత్రమే కాకుండా, బెంగుళూరులోని అన్ని వర్ధమాన క్రికెటర్లకు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీతో మీ కలలను నేర్చుకోవచ్చు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి కోచింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి” అని తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ నెలలో యూఏఈలో మొదలయ్యే టీ 20 ప్రపంచకప్‌లో ధోనీ భారత క్రికెట్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం తెలపారు. దీంతో ధోనీని అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

40 ఏళ్ల ధోనీ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ధోని చివరి మ్యాచ్ 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ సందర్భంగా ఆడాడు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. కాగా, ఆదివారం ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ టీం ఐపీఎల్ ఫైనల్స్‌ ఆడనుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా ధోని పేరుగాంచాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా భారతదేశానికి రెండు ప్రపంచకప్ టైటిల్స్‌ను అందించాడు.

Also Read: DC vs KKR Live Score, IPL 2021: ఓ వైపు రిషబ్.. మరోవైపు మోర్గాన్.. ఫైనల్ టికెట్ పోరులో నిలిచేదెవరో?

IPL 2021: ఆ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు.. తొలిసారి ఆ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్