IPL 2021: ఆ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు.. తొలిసారి ఆ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ లెజెండరీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ 2021 ఒక పీడకలగా మారింది. వరుస వైఫల్యాలతో పాటు కెప్టెన్సీని కూడా కోల్పోయాడు.

IPL 2021: ఆ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు.. తొలిసారి ఆ వివాదంపై స్పందించిన డేవిడ్ వార్నర్
David Warner

David Warner: ఐపీఎల్ 2021 సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చాలా చెడుగా మారింది. హైదరాబాద్ టీం 6 పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానంలో నిలిచింది. భారతదేశంలో జరిగిన తొలి సీజన్‌లోనూ, ఆ తరువాత యూఏఈలో జరిగిన రెండో దశలోనూ హైదరాబాద్ టీం జాతకం మారలేదు. మొదటి మ్యాచ్ నుంచి జట్టు పేలవ ప్రదర్శన కొనసాగించింది. అయితే టీం అదృష్టాన్ని మార్చడానికి కెప్టెన్‌ని కూడా మార్చారు. కానీ, అది కూడా పని చేయకపోవడంతో.. ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ టీంకు అనేక సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆస్ట్రేలియన్ లెజెండ్ డేవిడ్ వార్నర్.. సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ నుంచి దూరమయ్యాడు. ఆ తరువాత ప్లేయింగ్ ఎలెవన్‌ నుంచి దూరమయ్యాడు. ప్రస్తుతం టీం మేనేజ్‌మెంట్ కూడా తనకు ఎలాంటి విషయాలు చెప్పలేదంటూ తొలిసారి తన పెదవి విప్పాడు.

భారతదేశంలో ఆడిన ఈ సీజన్ మొదటి భాగంలో వార్నర్ జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ సమయంలో జట్టు పనితీరు ఏమాత్రం బాగోలేదు. వార్నర్ కూడా రాణించడంలో విఫలమయ్యాడు. అటువంటి పరిస్థితిలో 2016 లో హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా చేసిన వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ లెజెండరీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను నియమించారు. కానీ, ఇది కూడా జట్టు అదృష్టాన్ని మార్చలేదు. మొత్తం సీజన్‌లో హైదరాబాద్ 3 విజయాలు మాత్రమే సాధించింది.

కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో చెప్పలేదు: వార్నర్
హైదరాబాద్ లీగ్ దశ ముగిసిన తర్వాత టీం మెంబర్స్ అంతా వీడ్కోలు చెబుతూ ఓ వీడియోను నెట్టింట్లో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో వార్నర్ లేదు. ఈమేరకు తాజాగా వార్నర్ తొలిసారి స్పందించాడు. తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో కారణం మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. “నన్ను నిరాశపరిచిన విషయం ఏమిటంటే, కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో మేనేజ్‌మెంట్ ఇంత వరకూ చెప్పలేదు. ఫ్రాంఛైజీ తరపున 100 మ్యాచ్‌లు ఆడాను’ అని చెప్పుకొచ్చాడు.

“చెన్నైలో జరిగిన మొదటి 5 మ్యాచ్‌లలో 4 ఓడిపోయాం. ఇప్పటి వరకు జరిగినవి ఓ పీడ కలలా మర్చిపోవాలి. ఎన్నో ప్రశ్నలు నాలో ఉన్నాయి. వీటికి నాకు సమాధానాలు దొరకవు. కానీ, ముందుకు సాగాలి. నేను హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించడం తప్ప మరేమీ ఇష్టపడను. కానీ, నిర్ణయం యజమానుల చేతిలో ఉంటుంది’ అని ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు.

వార్నర్‌తో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై చాలా ప్రశ్నలు వెలిశాయి. యూఏఈలో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో వార్నర్‌కు అవకాశం లభించింది. కానీ, వార్నర్ రెండు ఇన్నింగ్స్‌లలో మొదటి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఏ మ్యాచ్‌లోనూ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అతను కొన్ని మ్యాచ్‌లలో స్టేడియానికి రావడానికి కూడా మేనేజ్‌మెంట్ అనుమతించలేదు. హోటల్‌లోనే ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్ ప్రవర్తనపై అనేక విమర్శలు వచ్చాయి. వార్నర్, హైదరాబాద్ విడిపోవడానికి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త సీజన్‌కు ముందు అనేక జట్ల కళ్ళు ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్‌పై ఉన్నాయి.

Also Read: ICC T20 World Cup: షాకిచ్చిన బీసీసీఐ.. ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన అక్షర్.. స్టాండ్‌ బై‌లో ప్లేయర్‌కు ఛాన్స్

Virat Kohli: టైటిల్ కోసం పూర్తి ప్రయత్నం చేశాను.. ఆర్సీబీకి కృతజ్ఞతలు.. విరాట్ కోహ్లీ భావోద్వేగ వీడియో..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu