AP Weather Report: ఏపీలో క్రమంగా తగ్గుతున్న నైరుతి ప్రభావం.. రాగల 3 రోజుల్లో మోస్తరు వర్షాలు
AP Weather Report: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్ బారిపాడు, మల్కన్‌గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల, గుండా వెళుతుంది. దీని ప్రభావం
AP Weather Report: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్ బారిపాడు, మల్కన్‌గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల, గుండా వెళుతుంది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఇక ఆదివారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా సాగుతోంది. తాజాగా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మరింత వైదొలిగాయి. రానున్న 2 రోజుల్లో మహారాష్ట్ర, ఒడిసా, ఈశాన్య భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.