Power Crisis: విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!

Power Crisis:  కరెంటు పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, అత్యవసర ప్రణాళికలను అధికారులు..

Power Crisis: విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
Cm Jagan
Follow us
Subhash Goud

|

Updated on: Oct 18, 2021 | 5:21 PM

Power Crisis:  కరెంటు పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, అత్యవసర ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. కరెంటు ఉత్పత్తి ప్రాజెక్టుపై ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు. సీలేరు సహా ప్రాజెక్టుల సాకారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని అన్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని అన్నారు.

170 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి..

కాగా, పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

పెరిగిన బొగ్గు నిల్వలు..

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ గత నాలుగు రోజుల కిందట బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఏపీలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 65,400 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 20,900 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. అలాగే రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కి 75,700 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్‌ ఉత్పత్తికి సరిపోతుంది. అలాగే సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. ఇక రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా..గత బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు జల విద్యుత్‌ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో జెన్‌కోకు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వస్తుండగా, శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్‌ యూనిట్లు వస్తోంది.

ఇవీ కూడా చదవండి:

CM KCR: మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉంది.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

Mothkupally Narsimhulu: కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు