YS Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలపై ఉన్నత స్థాయిలో...

YS Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలు..
Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2021 | 6:42 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలు, వైద్య, ఆరోగ్యశాఖలపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని అర్హులైన ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని.. అంతేకాకుండా నవంబర్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అనేక శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో మరణించినందున.. ఆయా శాఖల నుంచి ఎంతమంది మరణించారన్న దానిపై వివరాలపై ఒకటి లేదా రెండు రోజుల్లో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. ఆ లెక్కలను పరిశీలించిన తర్వాత ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యతను ప్రభుత్వం అప్పగించనుంది. మరోవైపు మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటు, ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

విద్యుత్‌పై సీఎం సమీక్ష..

అటు రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. కరెంటు ఉత్పత్తి ప్రాజెక్టుపై ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు. సీలేరు సహా ప్రాజెక్టుల సాకారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని అన్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని అన్నారు.

170 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి..

కాగా, పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Also Read:

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా స్మార్ట్ .. ఏ పనైనా సజావుగా చేయాలనుకుంటారు.. అందులో మీరున్నారా!

Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం