Bats: ఆ గ్రామంలో గబ్బిలాలే దేవతలు..! కరోనా రాకుండా కాపాడుతున్నాయట..?

Bats: సాధారణంగా జనాలు గబ్బిలాలను అపశకునంగా భావిస్తారు. కానీ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గ్రిద్దలూరు పంచాయితీ పనసారెడ్డిపల్లెలో దేవతలుగా భావిస్తున్నారు.

Bats: ఆ గ్రామంలో గబ్బిలాలే దేవతలు..! కరోనా రాకుండా కాపాడుతున్నాయట..?
Bats2
Follow us
uppula Raju

|

Updated on: Oct 18, 2021 | 6:20 PM

Bats: సాధారణంగా జనాలు గబ్బిలాలను అపశకునంగా భావిస్తారు. కానీ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గ్రిద్దలూరు పంచాయితీ పనసారెడ్డిపల్లెలో దేవతలుగా భావిస్తున్నారు. అవే మా ఊరికి శ్రీరామ రక్ష అని చెబుతున్నారు. సహజంగా గబ్బిలం ఒక చీకటి జీవి. ఇవి మనిషి వలే కళ్లు, నోరు కలిగి ఉంటాయి. గబ్బిలాలు పగలంతా చెట్లకు వేలాడుతూ ఉంటాయి రాత్రంతా ఆహారం కోసం సంచరిస్తాయి. వీటి జీవన శైలి పక్షులతో పోలిస్తే వింతగా ఉంటుంది.

అయితే పనసారెడ్డిపల్లెలో అడుగు పెట్టగానే గబ్బిలాల చేసే కీచు ధ్వనులు వినిపిస్తాయి. ఆ గ్రామంలోకి వెళ్లేదారిలో పెద్ద మర్రి, రావి చెట్టు ఉంటాయి. వాటి కొమ్మలకు తల కిందకి, కాళ్ళు పైకి పెట్టి వేలాడుతూ కనిపిస్తాయి. గ్రామంలో కి వెళ్లాలంటే వాటిని దాటుకొనే వెళ్లాలి. కొత్తగా వచ్చేవారు ఏ పనిపై వచ్చినా గబ్బిళాలను చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాదు వాటిగురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు.

Bats

Bats

చుట్టు పక్కల చాలా గ్రామాలు ఉన్నప్పటికి అక్కడి చెట్లపై ఒక్క గబ్బిలం కూడా కనిపించదు. కానీ పనసారెడ్డిపల్లె లోని ఈ రెండు చెట్లపై వేల సంఖ్యలో గబ్బిలాలు నివసిస్తాయి. అయితే ఇటీవల గబ్బిలాల వల్ల కరోనా వైరస్‌, నిపా వైరస్‌ల వ్యాప్తి జరుగుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయినా గానీ ఈ గ్రామ ప్రజలు వాటిని నిందించలేదు. అంతేకాక అవి మా ఊరి దేవతలని, వాటివల్లే మా గ్రామం సురక్షితంగా ఉందని భావిస్తున్నారు. గ్రామస్థులకు నిద్రా భంగం లేకుండా రాత్రి ఏడుగంటలకు మొదలు, ఆహారం కోసం ఇతర ప్రాంతాలకి వెళ్లి తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా అదే చెట్ల మీదకి చేరిపోతాయి.

గ్రామస్థులు కూడా దశాబ్దాలుగా గబ్బిలాల ఆశ్రయానికి ముప్పు రాకుండా కాపడుతుండటం విశేషం. పెద్ద గాలీవానకు చెల్లాచెదురై, గబ్బిళాల సంఖ్య దాదాపు గా తగ్గిపోయినప్పటికీ, ఇప్పుడు మర్రి,రావి చెట్లకు నిండుగా ఉన్నాయని గబ్బిళాలతో గ్రామానికి ఉన్న అనుభందాన్ని వివరించారు. వింత అనిపించినా ఇది వాస్తవం. చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా సోకినా ఆ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్నారు. ఈ ఊరి కథ తెలిసిన చాలామంది విస్మయం చెందుతున్నారు.

Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!

Samantha: నయనతార దారిలో సామ్‌…కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు!!

Six Pack: తెగ తిని.. వ్యాయామం చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేయదు.. అందుకు అవి కూడా సపోర్ట్ చేయాలి!