VVS Laxman: ఎన్‎సీఏ హెడ్ కోచ్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. తిరస్కరించిన వివిఎస్ లక్ష్మణ్!..

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఎన్‎సీఏ హెడ్ కోచ్ వేటలో పడింది. ఈ పదవికి భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వివిఎస్ లక్ష్మణ్‎ను సంప్రదించింది. వివిఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.

VVS Laxman: ఎన్‎సీఏ హెడ్ కోచ్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. తిరస్కరించిన వివిఎస్ లక్ష్మణ్!..
Laxman
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 18, 2021 | 3:04 PM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఎన్‎సీఏ హెడ్ కోచ్ వేటలో పడింది. ఈ పదవికి భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వివిఎస్ లక్ష్మణ్‎ను సంప్రదించింది. వివిఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాబోయే టీ 20 ప్రపంచ కప్ తర్వాత సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా ప్రస్తుత ఎన్‎సీఏ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో బీసీసీఐ ఇప్పుడు ఎన్‎సీఏ హెడ్ కోచ్ పదవి కోసం తమ శోధనను కొనసాగిస్తుంది.

భారత క్రికెట్‌కు గణనీయమైన సహకారం అందించిన అభ్యర్థి కోసం BCCI అన్వేషణ సాగిస్తుంది. లక్ష్మణ్ దేశీయ క్రికెట్‌లో బెంగాల్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్‎గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమ్ మెంటార్‎గా ఉన్నారు. వివిఎస్ లక్ష్మణ్ భారత టెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకరిగా నిలిచారు. 134 మ్యాచ్‌ల్లో 17 సెంచరీలతో 8781 పరుగులు చేశాడు .

లక్ష్మణ్ బీసీసీ ప్రాతిపదనను నిరాకరించిన తర్వాత కోచ్ కోసం ప్రక్రియను కొనసాగిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మాజీ జట్టు కెప్టెన్ ద్రవిడ్, భారత జట్టులో లక్ష్మణ్‌కు దీర్ఘకాల సహచరుడిగా ఉన్నారు. ద్రవిడ్ రవిశాస్త్రి స్థానంలో ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. టీ 20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా శాస్త్రి ఒప్పందం ముగియనుంది. టీ20 ప్రపంచ కప్‎లో భారత్ అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మెగ్ టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 14న జరగనుంది.

Read Also..  T20 World Cup 2021: పాకిస్తాన్‌ను ఓడించడంలో పీహెచ్‌డీలు చేసిన టీమిండియా ప్లేయర్లు.. వీళ్ల దెబ్బకు కోలుకోవడం కష్టమే..!