Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: ‘సైనికుల త్యాగాలను దాయాదుల క్రికెట్‌తో పోల్చడం సరికాదు.. ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ మాత్రమే’

T20 World Cup: ఐసీసీ నిర్వహిస్తోన్న టీ20 ప్రపంచ కప్ 2021లో ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ రౌండ్‌లో పోటీలు మొదలయ్యాయి. అయితే అక్టోబర్ 24న ఈ టోర్నమెంట్‌లో కీలకమైన మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంల మధ్య జరగనుంది.

India vs Pakistan: 'సైనికుల త్యాగాలను దాయాదుల క్రికెట్‌తో పోల్చడం సరికాదు.. ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ మాత్రమే'
T20 World Cup 2021 India Vs Pakistan
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2021 | 5:23 PM

IND vs PAK, T20 World Cup 2021: దుబాయ్‌లో ప్రపంచ దేశాల పోరాటం ప్రారంభమైంది. ఐసీసీ నిర్వహిస్తోన్న టీ20 ప్రపంచ కప్ 2021లో ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ రౌండ్‌లో పోటీలు మొదలయ్యాయి. అయితే అక్టోబర్ 24న ఈ టోర్నమెంట్‌లో కీలకమైన మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న సోషల్ మీడియాలో ban pak cricket అంటూ డిమాండ్లు మొదలయ్యాయి. కారణం పలుమార్లు తీవ్రవాదులు సరిహద్దుల వెంబడి కాల్పులు జరపడంతో సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తూ అసలు పాకిస్తాన్‌ను క్రికెట్ నుంచి నిషేధించాలంటూ ఐసీసీని కోరారు. అయితే ఈ విషయంపై ఏబీపీ ఛానల్ ఓ టాక్ షో ‘విశ్వ విజేత’ ను నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన షూట్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ షూట్‌ను నిన్న రాత్రి దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ప్లాజాలో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అజారుద్దీన్, జహీర్ అబ్బాస్, అతుల్ వాసన్, దినేష్ కార్తీక్, యూనస్ ఖాన్, మహమ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఈ షోను మ్యాచ్ ముందు రాత్రి అంటే అక్టోబర్ 23 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఏబీపీ ప్రకటించింది. అయితే ఇరుదేశాల మధ్య అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌తో పాటు అలాగే ఇదు దేశాల మధ్య ముందు ముందు జరగబోయే మ్యాచుల గురించి చర్చించినట్లు సమాచారం. ఈ షోలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఇది వరకు జరిగిన పోటీలు, అప్పటి పరిస్థితులు, భవిష్యత్తులో జరగబోయే మ్యాచుల గురించి మాట్లాడారు.

ఇదంతా ఒకఎత్తయితే, ఓ ట్వీట్ ఇంటర్నెట్‌లో ఎంతో పెద్ద గందరగోళం సృష్టించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగడానికి ఒక వారం కంటే ముందుగా, అశోక్ పండిట్ చేసిన ఓ హిందీ ట్వీట్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇందులో ఏముందంటే, ‘పాకిస్తాన్‌‌తో క్రికెట్‌ ఆడటం సరిహద్దులో మరణించిన వారందరిని అవమానించినట్లేనని, ఉగ్రవాద దాడులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌తో ఆడడం మానుకోవాలి’ అంటూ అందులో పేర్కొన్నారు. మరోవైపు విరాట్, అతని బృందం మ్యాచ్ నుంచి తప్పుకోవడం కంటే, ప్రత్యర్థితో పోటీ పడి మైదానంలో ఓడిస్తేనే మరణించిన వారికి ఘననివాళి ఇచ్చినట్లు అవుతుందని మరికొందరు ట్విట్టర్లో కామెంట్లు చేశారు. ఎందుకంటే సైనికులు యుద్ధభూమిని విడిచిపెట్టరు కదా అని మరికొందరు కామెంట్ చేశారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్‌ను ఓడిస్తే పాకిస్తాన్ బృందానికి బ్లాంక్ చెక్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, బహుశా మనం అతని డబ్బును ఆదా చేయడంలో సహాయపడవచ్చంటూ మరికొంత మంది కామెంట్లు కురిపించారు. ఐసీసీ ఈవెంట్లలో గత ఐదు ప్రయత్నాలలో పాకిస్తాన్ టీం భారత్‌ను ఓడించలేదు. వారికి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. 1986లో షార్జా స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో చివరి బంతికి జావేద్ మియాందాద్ సిక్స్ కొట్టి పాకిస్తాన్‌ను గెలిపించాడు. అయితే ఇది ఇప్పటికీ అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. 2007లో డర్బన్‌లో ఆఖరి బంతికి ఇంజుమాముల్ హక్‌పై భారత్ విజయం సాధించింది. 2016లో ఢాకాలో జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచులో పాకిస్తాన్ టీంను కేవలం 83 పరుగులకే టీమిండియా ఆల్ ఔట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన 17 ఐసీసీ స్పాన్సర్డ్ టోర్నమెంట్‌లలో భారత్ 14 మ్యాచుల్లో పాకిస్తాన్‌పై గెలిచింది. 1992 లోనూ భారత్ 43 పరుగుల తేడాతో గెలిచింది. అలాగే 1996 లోనూ భారత్ 39 పరుగులతో విజయం సాధించింది. ఇక 1999 లో 47 పరుగుల తేడాతో, 2003 లో 6 వికెట్ల తేడాతో, 2007 లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 2011 లో 29 పరుగుల తేడాతో, 2012, 2013 లో 8 వికెట్లతో, 2014 లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అలాగే 2015 లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2016 లో ఆరు వికెట్ల తేడాతో, 2017 లో 124 పరుగుల తేడాతో, 2019 లో 89 పరుగుల తేడాతో భారత్ విజయాలు సాధించిందని ఆ చర్చలో గుర్తు చేసుకున్నారు.

అలాగే వాస్తవానికి, క్రీడలతో రాజకీయాలను కలపకూడదని కూడా ఇందులో చర్చించినట్లు సమాచారం. “ప్రస్తుతం క్రీడలు స్వచ్ఛమైన రాజకీయాలకు నిలయంగా మారాయి. అందుకే ఇలాంటి ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. కానీ, క్రికెట్‌ను, సైనికులతో పోల్చకుండా ఉండాలి. ఎందుకంటే ఆటలు వినోదం కోసం మాత్రమే ఆడతారు. ఇందులో గెలుపు, ఓటములు సహజం. ఆట పూర్తయ్యాక ఇరుజట్లు కరచాలనం చేసుకుంటారు. కానీ, సైనికులు తమ చుట్టూ ప్రమాదాలతో సహవాసం చేస్తుంటారు. సరిహద్దులో మన సైనికులు కాపలాగా నిలబడి, విధి నిర్వహణలో చనిపోతే, మిగతా వారు వారికి వందనం చేస్తారు. వారి త్యాగాలు ఎంతో గొప్పవి. అందుకే అలాంటి గొప్ప సైనికులను, క్రికెట్‌తో పోల్చకూడదు. ఇది కేవలం బంతి, బ్యాట్ మధ్య పోరాటంగానే చూడాలి. ఆడండి, గెలవండి లేదా ఓడండి, కానీ, మరుసటి రోజు దానిని మర్చిపోండి’ అంటూ చర్చకు ముగింపు ఇచ్చారంట.

Also Read: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

 India New Coach: నాకైతే సమాచారం లేదు.. కోచ్ అయ్యాక ఏం చేస్తాడో కూడా తెలియదు: విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్

T20 World Cup 2021: ఐపీఎల్‌లో రాణించినా.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో సెలక్ట్ కాని సూపర్‌స్టార్‌లు.. వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!