India New Coach: నాకైతే సమాచారం లేదు.. కోచ్ అయ్యాక ఏం చేస్తాడో కూడా తెలియదు: విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్

టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు అనేక నివేదికలు వెల్లడవుతున్నాయి. వీటిపైనే కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

India New Coach: నాకైతే సమాచారం లేదు.. కోచ్ అయ్యాక ఏం చేస్తాడో కూడా తెలియదు: విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Virat Kohli And Rahul Dravid
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2021 | 11:41 AM

Rahul Dravid: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తే ఏమి జరుగుతుందో తనకు తెలియదంటూ షాక్ ఇచ్చాడు. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ నియామకంపై తాను ఇంకా సీనియర్ బీసీసీఐ అధికారులను కలవలేదని కోహ్లీ తెలిపాడు.

టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు అనేక నివేదికలు వెల్లడవుతున్నాయి. వీటిపైనే కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికల ప్రకారం, ద్రవిడ్ ఇటీవల బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షాను కలిశారు. ఈ సమావేశంలో గంగూలీ, షా ఇద్దరూ కలిసి టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ని ఒప్పించగలిగారని వార్తలు వెలువడుతున్నాయి.

ఈమేరకు ద్రవిడ్‌కు 2 సంవత్సరాల ఒప్పందాన్ని అప్పగించాడాని తెలుస్తోంది. అంటే 2023 వరల్డ్ కప్ వరకు ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా కొనసానున్నాడు. రాబోయే టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా శాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఈమేరకు ఆదివారం దరఖాస్తులను కూడా కోరింది. అయితే ఇవన్నీ కేవలం ఫార్మాలిటేకేనని తెలుస్తోంది. టీమిండియా నూతన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం పూర్తయిందని వార్తలు వెలువడుతున్నాయి.

“ఏం జరుగుతుందో నాకింకా పూర్తిగా తెలియదు. ఇంకా ఎవరితోనూ నేను కోత్త కోచ్‌ నియామకంపై చర్చించలేదు” అని కోహ్లీ పేర్కొన్నాడు. టీ 20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్‌ల మీడియా సెషన్‌లో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

48 ఏళ్ల ద్రవిడ్ గత ఆరు సంవత్సరాలుగా జాతీయ ‘ఏ’, అండర్-19 టీంలకు కోచ్‌గా ఉన్నారు. రిషబ్ పంత్, అవేశ్ ఖాన్, పృథ్వీ షా, హనుమ విహారి, శుభ్మన్ గిల్‌తో సహా అనేక మంది యువకులను తీర్చిదిద్దిన ఘనత ద్రవిడ్‌కే దక్కింది. అతను ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహిస్తున్నాడు.

Also Read: T20 World Cup: ప్రపంచ రికార్డు సృష్టించిన బంగ్లా ఆల్‌రౌండర్.. ఆ రికార్డులో అతనే నెంబర్ వన్.. టాప్‌ 5లో కానరాని భారత బౌలర్లు

T20 World Cup 2021: ఐపీఎల్‌లో రాణించినా.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో సెలక్ట్ కాని సూపర్‌స్టార్‌లు.. వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!