T20 World Cup: ప్రపంచ రికార్డు సృష్టించిన బంగ్లా ఆల్‌రౌండర్.. ఆ రికార్డులో అతనే నెంబర్ వన్.. టాప్ 5లో కానరాని భారత బౌలర్లు
Shakib al Hasan: షకీబ్ అల్ హసన్ 2007 లో జరిగిన మొదటి టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతి టీ 20 ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు.
T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 మ్యాచులు ఒమన్, యూఏఈలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజునే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించబడింది. ఈ రికార్డును బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ నెలకొల్పాడు. మొదటి రౌండ్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పురుషుల అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ రికార్డును 2 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. షకీబ్ ప్రస్తుతం 108 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు.
2007 నుంచి ప్రతి టీ 20 ప్రపంచకప్‌లో ఆడుతున్న షకీబ్ మరోసారి తన జట్టు కోసం అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, షకీబ్ పేరు మీద 106 వికెట్లు ఉన్నాయి. షకీబ్ మరో రెండు వికెట్లు జోడించడంతో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ 11 వ ఓవర్లో లెజెండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు. ఇన్నింగ్స్‌లో షకీబ్ వేసిన మూడో ఓవర్‌లో ఈ రికార్డు బద్దలైంది. మొదట రిఫీ బారింగ్టన్‌ను అఫిఫ్ హుస్సేన్ క్యాచ్ ద్వారా మలింగను సమం చేశాడు. ఆతర్వాత మైఖేల్ లీష్ నాల్గవ బంతికి లిటన్ దాస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో తన 108 వ వికెట్ తీసి కొత్త రికార్డు సృష్టించాడు.
100 వికెట్లు, 1000 టీ 20 పరుగుల రికార్డు షకీబ్ ప్రస్తుతం 89 టీ 20 ఇంటర్నేషనల్‌లలో 108 వికెట్లు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 100 కంటే ఎక్కువ వికెట్లు, 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా షకీబ్ నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో 1700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. వికెట్ల విషయానికొస్తే, రెండవ స్థానంలో ఉన్న మలింగ 84 మ్యాచ్‌ల కెరీర్‌లో 107 వికెట్లు తీశాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ 83 మ్యాచ్‌ల్లో 99 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది 99 వికెట్లతో నాల్గవ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 95 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు.
600 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ప్లేయర్ ఇది మాత్రమే కాదు, ఈ రెండు వికెట్లతో షకీబ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో తన 600 వికెట్లను పూర్తి చేశాడు. అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బంగ్లాదేశ్ బౌలర్‌గా నిలిచాడు. 362 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఏ ఇదర బంగ్లా బౌలర్ కూడా 400 వికెట్లు తీసుకోలేదు. రెండవ స్థానంలో వెటరన్ పేసర్ మష్రఫే మోర్తాజా ఉన్నాడు. అతను 308 మ్యాచ్‌ల్లో 389 వికెట్లు సాధించాడు.