AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: రెండేళ్ల తర్వాత టీమిండియాలో ‘కింగ్ ధోని’.. గ్రాండ్‌గా వెల్‌కం చెప్పిన బీసీసీఐ.. ఆటగాళ్లకు శిక్షణ షురూ..!

Ms Dhoni: రెండేళ్ల క్రితం టీమిండియాతో డ్రెస్సింగ్ రూమ్, ఫీల్డ్‌లో చివరిగా కనిపించిన ధోనీ మరోసారి తిరిగి వచ్చాడు. ఈసారి కూడా టీమింయాకు టైటిల్ అవసరమయ్యే ప్రపంచకప్‌లో భాగమయ్యాడు.

T20 World Cup: రెండేళ్ల తర్వాత టీమిండియాలో 'కింగ్ ధోని'.. గ్రాండ్‌గా వెల్‌కం చెప్పిన బీసీసీఐ.. ఆటగాళ్లకు శిక్షణ షురూ..!
Ms Dhoni Joins Teaminida
Venkata Chari
|

Updated on: Oct 18, 2021 | 7:29 AM

Share

MS Dhoni Joins Indian Team: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత, భారత జట్టు ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ 17 ఆదివారం నుంచి ప్రపంచ కప్ మ్యాచులు ప్రారంభమైన తరువాత, భారత జట్టు కూడా మొదటిసారిగా మైదానంలోకి వచ్చింది. టీం హడల్ నుంచి ట్రైనింగ్ సెషన్ వరకు భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. కానీ, ఈ సెషన్‌లో అతిపెద్ద ఆకర్షణ మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనినే. రెండు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి నాల్గవ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) టీమిండియాతో మరోసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత, ధోనీ మెన్‌ ఇన్ బ్లూ టీంకు ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే టీమిండియా దుస్తుల్లో కనిపించాడు.

టీ 20 వరల్డ్‌కప్‌కు ధోనీ టీమిండియాతో మెంటార్‌గా ఉంటాడు. 2007 లో తన కెప్టెన్సీలో భారత ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాతో రెండేళ్ల తర్వాత మొదటిసారి కనిపించాడు. 2019 జూలై 10 న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత, భారత మాజీ కెప్టెన్ టీమిండియా నుంచి దూరమయ్యాడు. 15 ఆగస్టు 2020 న అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తి వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

మెంటార్‌సింగ్ ధోనీకి స్వాగతం భారత జట్టు ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. అక్కడ వారు అక్టోబర్ 18న సోమవారం జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఆదివారం సాయంత్రం టీమిండియా మొత్తం జట్టు సన్నాహాల కోసం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో కసరత్తులు ప్రారంభించింది. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో టీమిండియా, ధోనీ ఫోటోలను పోస్ట్ చేసింది.

ఇందులో ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బందితో బ్యాటింగ్ గురించి ధోనీ మాట్లాడుతున్నాడు. ధోనీకి స్వాగతం పలుకుతూ, బీసీసీఐ తన పోస్ట్‌లో “కింగ్‌కు స్వాగతం. ఎంఎస్ ధోని టీమిండియా కోసం కొత్త పాత్రలో తిరిగి వచ్చాడు’ అని రాసుకొచ్చింది.

టైటిల్ కరువును అంతం చేయడానికే.. 2013 నుంచి భారత జట్టు ఎటువంటి ఐసీసీ టైటిల్ గెలవలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి పదవీకాలంలో మూడు వైఫల్యాల కారణంగా బీసీసీఐ అభ్యర్థన మేరకు ధోని టీమిండియాతో చేరాడు. ఈ ప్రపంచ కప్‌ వరకు టీంతోనే ఉంటాడు.

కోహ్లీ ఏమన్నాడంటే.. మరోవైపు, భారత కెప్టెన్ కోహ్లీ టీమిండియాతో ధోనీ అనుబంధం గురించి మాట్లాడుతూ, ఇది డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్ల మనోబలాన్ని పెంచుతుందని చెప్పాడు. కోహ్లీ మాట్లాడుతూ, “ధోనీ నాయకత్వ పాత్రలో ఉన్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వాతావరణంలో అతను నాతో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. టీ 20 వరల్డ్ కప్ కోసం ఎంఎస్ ధోనీని ‘మెంటర్’ గా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, అతని ఉనికి మాకు ధైర్యాన్ని పెంచుతుంది” అని చెప్పుకొచ్చాడు.

అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే సూపర్ -12 స్టేజ్‌లో తమ మొదటి మ్యాచ్‌తో భారత జట్టు ప్రపంచకప్‌లో ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. పాకిస్థాన్‌తో పాటు భారత జట్టు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌తో తమ గ్రూపులో తలపడనుంది. ఈ గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుతాయి.

Also Read: తొలిరోజే బంగ్లాకు ఎదురుదెబ్బ.. తక్కువ ర్యాంక్ జట్టుపై ఘెర పరాజయం.. భారత సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే?

T20 World Cup, Ind vs Eng Warm-Up, Live Streaming: ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశం