తొలిరోజే బంగ్లాకు ఎదురుదెబ్బ.. తక్కువ ర్యాంక్ జట్టుపై ఘెర పరాజయం.. భారత సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే?
T20 World Cup: సూపర్ -12 దశకు చేరుకోవడానికి బంగ్లాదేశ్ మొదటి రౌండ్‌లో తమ గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలిచి ఉండాలి. కానీ, వారి మొదటి మ్యాచ్‌లో వారు తక్కువ ర్యాంక్ జట్టుతో ఓడిపోయారు.
T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 మొదటి రోజున బంగ్లా ఆశలకు బ్రేకులు పడ్డాయి. మొదటి రౌండ్ రెండవ మ్యాచ్‌లో స్కాట్లాండ్ టీం బలమైన, ఉన్నత స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. స్కాట్లాండ్ నుంచి ఒక ఆటగాడు మాత్రమే బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించారు. క్రిస్ గ్రీవ్స్ మొదట తన బ్యాట్‌తో బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. తరువాత తన స్పిన్‌తో రెండు పెద్ద వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విజయంతో స్కాట్లాండ్‌కు రెండు పాయింట్లు దక్కాయి. నాలుగు జట్ల సమూహంలో ఒమన్ తర్వాత వారు రెండవ స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ పాయింట్‌లు లేకుండా మూడవ స్థానంలో ఉంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. క్రిస్ గ్రీవ్స్ 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. ముష్ఫికర్ రహీమ్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు. గ్రీవ్స్ రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ విజేతను చివరి ఓవర్‌లో నిర్ణయించారు. ఇన్నింగ్స్ 20 వ ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 24 పరుగులు అవసరం. బంగ్లాదేశ్ విజయానికి చివరి మూడు బంతుల్లో 18 పరుగులు, టై చేయడానికి 17 పరుగులు అవసరం. కానీ, మెహందీ హసన్ ఈ మూడు బంతుల్లో 4, 6, 1 పరుగులు మాత్రమే చేయగలిగాడు. షఫ్యాన్ షరీఫ్ చివరి ఓవర్ వేశాడు.
ప్రమాదంలో బంగ్లా సూపర్ 12 ప్రయాణం బంగ్లాదేశ్ సూపర్ 12 ప్రయాణం కష్టంగా మారింది. గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు వారికి కష్టంగా మారింది. స్కాట్లాండ్ టీం మిగిలిన మ్యాచ్‌లపై బంగ్లా ఆశలు నిలిచి ఉన్నాయి. స్కాట్లాండ్ జట్టు పపువా న్యూ గినియా, ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే, అది ఈ గ్రూపులో టాపర్ అవుతుంది. దీంతో భారత్ ఉన్న గ్రూపులో కూడా బంగ్లా జట్టు చోటు దక్కించుకోవడంలో విఫలం కావొచ్చు.
ఈ గ్రూప్‌లో అగ్రశ్రేణి జట్టు సూపర్ -12 లో భారత్, పాకిస్థాన్‌తో ఉంటుంది. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో కూడిన గ్రూప్‌కు వెళ్తుంది. యూఏఈ మైదానంలో ఈ జట్లను ఎదుర్కోవడం భారతదేశం, పాకిస్తాన్ వంటి జట్ల కంటే సులభంగా ఉండవచ్చు.
ఈరోజు కూడా.. టీ 20 ప్రపంచకప్ రెండో రోజు కూడా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. క్వాలిఫయర్స్ గ్రూప్ ఏ లో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో, రెండో మ్యాచ్ రాత్రి 7:00 నుంచి నమీబియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతుంది.
Also Read: