- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup records: From Hayden To Kohli and Tamim, list of Highest Scorerer in every edition
T20 World Cup Records: పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే.. ట్రోఫీని గెలిపించడంలో మాత్రం విఫలం
ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ 6 ఎడిషన్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ప్రత్యేక విషయం ఏమిటంటే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్ కాకపోవడం విశేషం.
Updated on: Oct 17, 2021 | 9:44 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఒమన్, యూఏఈలో అక్టోబర్ 17 ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీంతో వచ్చే ఒక నెల పాటు పరుగుల వర్షం కురవనుంది. చాలా సిక్సర్లు, ఫోర్లు కనిపిస్తాయి. వేగవంతమైన బ్యాటింగ్‌కు ఆ ఫార్మాట్ పేరుగాంచింది. ఈ ఫార్మాట్‌లో ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేశాడో అని తరచుగా వెతుకుతూనే ఉంటాం. అందుకే ఇప్పటివరకు ఆడిన ప్రతి టీ 20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల లిస్టు ఇక్కడ చూపించబోతున్నాం.

మొదటి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. కానీ, ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాత్రం అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా లెజెండ్ 6 ఇన్నింగ్స్‌లలో అత్యధికంగా 265 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు చేశాడు. హేడెన్ సగటు 88.33, స్ట్రైక్ రేట్ 144.80గా ఉంది. అతని అత్యధిక స్కోరు 73 పరుగులు (నాటౌట్).

2009లో జరిగిన రెండో టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. టీం ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ టోర్నమెంట్ 7 ఇన్నింగ్స్‌లలో అత్యధికంగా 317 పరుగులు చేశాడు. సగటు 52.83, స్ట్రైక్ రేట్ 144.74గా ఉంది. అతను 96 పరుగులు (నాటౌట్) అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో మొత్తం 3 అర్ధ సెంచరీలు సాధించాడు.

2010 లో ఆడిన మూడో ప్రపంచకప్‌లో మరోసారి శ్రీలంక ఆటగాడు అత్యధిక పరుగులు చేశాడు. ఈసారి మహేల జయవర్ధనే ఈ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. అతను 6 ఇన్నింగ్స్‌లలో 60 సగటుతో అత్యధికంగా 159.78 స్ట్రైక్ రేటుతో 302 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

2012 లో నాల్గవ టీ 20 ప్రపంచ కప్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ బ్యాట్ తీవ్రంగా గర్జించింది. అతను 6 ఇన్నింగ్స్‌లు ఆడి, 49.80 సగటు, 150 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు చేశాడు. అతని ఉత్తమ స్కోరు 72 పరుగులుగా నిలిచింది. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

2014 లో బంగ్లాదేశ్‌లో ఆడిన ప్రపంచకప్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. 6 ఇన్నింగ్స్‌లలో 316 పరుగులు చేశాడు. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా ఇది నమోదైంది. అతను 4 అర్ధ సెంచరీలు చేశాడు. జట్టును ఫైనల్‌కు నడిపించాడు. అక్కడ శ్రీలంక భారతదేశాన్ని ఓడించింది.

6వ ప్రపంచకప్ 2016 లో భారతదేశంలో నిర్వహించారు. ఈసారి బంగ్లాదేశ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్ అత్యధిక పరుగులు చేసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. తమీమ్ 6 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 73.75 సగటు, 142 బలమైన స్ట్రైక్ రేట్‌తో 295 పరుగులు చేశాడు. టోర్నీలో తమీమ్ ఓ సెంచరీ(103), ఓ అర్థ సెంచరీ కూడా సాధించాడు.




