Prithvi Shaw: కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న పృథ్వీ షా.. దాని ధర ఎంతంటే..

భారత స్టార్ బ్యాట్స్‌మన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఆదివారం (అక్టోబర్ 17) కొత్త కారును కొనుగోలు చేశారు. కారుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు...

Prithvi Shaw: కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న పృథ్వీ షా.. దాని ధర ఎంతంటే..
Pruthvisha
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 18, 2021 | 4:21 PM

భారత స్టార్ బ్యాట్స్‌మన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఆదివారం (అక్టోబర్ 17) కొత్త కారును కొనుగోలు చేశారు. కారుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021లో ఆడి తిరిగి వచ్చిన షా, బీఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టూరిస్మోను కొనుగోలు చేశారు. 21 ఏళ్ల యువకుడి కారు ధర రూ .68.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందుకు సంబంధించిన పిక్స్‎ను పృథ్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. “కింద నుండి మొదలుపెట్టాము ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం!!” అని క్యాప్షన్ రాశారు. పృథ్వీ అతని తండ్రి పంకజ్ షా కొత్త కారుతో ఫొటోలు దిగారు.

పృథ్వీ షా ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఓపెనర్ అసాధారణమైన ప్రతిభను కనబరిచాడు. షా ఈ సీజన్‎లో 15 మ్యాచులు ఆడి 479 పరుగులు చేశాడు. షా 31.93 సగటుతో 4 అర్ధ సెంచరీలు, 159.13 స్ట్రైక్ రేట్ ఉన్నాడు. లీగ్ దశ ముగిసిన తర్వాత ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ ఐపీఎల్ 2021 ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన మొదటి క్వాలిఫయర్‌1లో, షా 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ నాయకత్వంలోని జట్టు క్వాలిఫయర్ 2లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. 2020లో DC ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, షా 13.5 మ్యాచుల్లో 17.53 సగటుతో కేవలం 228 పరుగులు చేశాడు.

View this post on Instagram

A post shared by PRITHVI SHAW (@prithvishaw)

Read Also.. VVS Laxman: ఎన్‎సీఏ హెడ్ కోచ్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. తిరస్కరించిన వివిఎస్ లక్ష్మణ్!..