Lambasingi: పోలీస్ వర్సెస్ లంబసింగి గ్రామస్తులు. గొడవ మొదలైంది. ఇంతకీ ఏంటా రగడ?
లంబసింగి ఘాట్ లో కాల్పుల కలకలం జరిగింది. నల్గొండ పోలీసులు వచ్చింది.. ఒకరి కోసం- పట్టుకుంది.. మరొకర్ని.. దీంతో వెంట పడ్డ గ్రామస్తులు కారు ఆపేసరికి
Lambasingi: లంబసింగి ఘాట్ లో కాల్పుల కలకలం జరిగింది. నల్గొండ పోలీసులు వచ్చింది.. ఒకరి కోసం- పట్టుకుంది.. మరొకర్ని.. దీంతో వెంట పడ్డ గ్రామస్తులు కారు ఆపేసరికి కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో ఇద్దరు స్థానికులు గాయాల పాలు కావడంతో.. పోలీస్ వర్సెస్ లంబసింగి గ్రామస్తులు గొడవ మొదలైంది. ఇంతకీ ఏంటా రగడ? అనే లోతుల్లోకి వెళితే, ఇటీవల లంబసింగి ఘాట్ లో.. భీమయ్య అనే స్థానికుడ్ని గంజాయి స్మగ్లింగ్ పేరిట అరెస్టు చేశారు నల్గొండ నుంచి వచ్చిన పోలీసులు. వాళ్లు వచ్చింది బాలకృష్ణ అనే స్మగ్లర్ కోసం.. కానీ అరెస్టు చేసింది భీమయ్యను. దీంతో అదిరిపడ్డ భీమయ్య బంధుమిత్రులు.. పోలీసులను ఛేజ్ చేశారు. నర్సీపట్నం వైపు.. రెండు కార్లు.. ఛేజింగ్.. నర్సీపట్నం రూట్లో ట్రాఫిక్ జామ్ జరగ్గా ఓ లారీ అడ్డు తగిలింది. కారును ఆపే యత్నం చేశారు లంబసింగి గ్రామస్తులు- తమ కారు ఆపినందుకు కాల్పులు జరిపారు నల్గొండ పోలీసులు. దీంతో కామరాజ్, రాంబాబు అనే ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను వీరిని ఆగమేగాల మీద ఆస్పత్రికి తరలించారు. ఈ పోలీస్ ఆపరేషన్ మీద గ్రామస్తుల కంప్లయింట్ చేస్తున్నారు.
ఇక, విశాఖ గంజాయికీ నల్గొండ పోలీసులకూ సంబంధమేంటంటే.. రెండు నెలల క్రితం నల్గొండ పోలీసులు ఓ విషయాన్ని గుర్తించారు. ఏపీ బోర్డర్ డిస్ట్రిక్ట్ అయిన నల్గొండ వేదికగా.. మన్యం స్మగ్లర్లు భారీ ఎత్తున గంజాయి రవాణాకు స్కెచ్చేసినట్టు గుర్తించారు జిల్లా పోలీసులు. ఈ విషయంపై దృష్టి సారించారు.. నల్గొండ ఎస్పీ.
తమ దగ్గరనున్న సమాచారంతో మన్యం వస్తున్నట్టు విశాఖ పోలీసులకు .. ముందస్తు సమాచారమిచ్చారు. లంబసింగి ఘాట్ లో సెర్చ్ మొదలు పెట్టాక.. ఓ కన్ ఫ్యూజన్. అక్కడ ఒకరి పేర్లతో మరొకరు తిరగడం వల్ల.. గందరగోళం. ఒకర్ని పట్టుకోడానికి బదులు.. మరొకర్ని పట్టుకున్నారు. దానికి తోడు వీళ్లు మావోయిస్టుల పేరిట గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారనీ. ఒక్కర్ని పట్టుకుంటే మొత్తం వ్యవహారం బయటకొస్తుందని.. అంటారు నల్గొండ పోలీసులు. ప్రాణరక్షణ కోసమే తాము కాల్పులు జరిపామనీ చెప్పుకొస్తున్నారు తెలంగాణ పోలీసులు.
Read also: Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి