Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Midnight Horror: తల్లి నిద్రపోయిన కాసేపటికే.. కవలల దుర్మరణం.. అర్ధరాత్రి 25వ అంతస్థు పైనుంచి పడి..

Twins Death: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవలలు మృతి చెందారు. ఈ సంఘటన

Midnight Horror: తల్లి నిద్రపోయిన కాసేపటికే.. కవలల దుర్మరణం.. అర్ధరాత్రి 25వ అంతస్థు పైనుంచి పడి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2021 | 4:01 PM

Twins Death: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవలలు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు పోలీసులు తలిపారు. సత్యనారాయణ, సూర్యనారాయణ అనే ఇద్దరు కవలలు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. వీరికి మరో సోదరి కూడా ఉంది. తమిళనాడు చెన్నై ప్రాంతానికి చెందిన వీరి కుంటుంబం రెండు సంవత్సరాల క్రితం ఘజియాబాద్‌ వచ్చింది. ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్‌ విహార్‌ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం చేసిన సత్యనారాయణ, సూర్యనారాయణ తల్లి మొబైల్‌ తీసుకుని ఆన్‌లైన్‌ క్లాస్‌ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్‌లో గేమ్స్‌ ఆడారు.

తల్లి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లిన కవల సోదరులు.. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు 25వ అంతస్తు నుంచి పడి దుర్మరణం చెందారు. కాసేపటి తర్వాత తల్లి పిల్లల కోసం వెతికినా కనిపించలేదు. కింద జనం గుంపుగా ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది. మరణించిందే తన కుమారులేనని గుండెలవిసేలా రోదించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా.. బాల్కనీలో ప్లాస్టిక్‌ చైర్‌, దాని మీద ఇంకో చైర్ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చంద్రుడిని చూడాలని భావించి ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారని.. కానీ దురదృష్టవశాత్తు పైనుంచి కిందపడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..

Crime News: సొంతింటిపైనే కోడలి కన్ను.. కోటి విలువైన బంగారం, నగదు చోరీ.. ఎవరికి తెలియకుండా..