AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..

Lawyer Killed Inside Court Complex: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు.. జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిపై కాల్పులు జరిపి

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2021 | 3:23 PM

Share

Lawyer Killed Inside Court Complex: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు.. జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. షాజహాన్‌పూర్‌ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాది భూపేంద్ర సింగ్‌ కోర్టు కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో కొందరితో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్లు పక్క బ్లాక్‌లో ఉన్న న్యాయవాదులు తెలిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. భూపేంద్ర సింగ్ రక్తం మడుగులో కిందపడి చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహం సమీపంలో నాటు తుపాకీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

న్యాయవాది భూపేంద్ర సింగ్‌ హత్యకు కారణం ఏమిటో తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పలువురి నుంచి వివరాలు సేకరించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరి ఆధారాలు సేకరించిందని చెప్పారు. కాగా, భూపేంద్ర సింగ్‌ గతంలో బ్యాంకులో పని చేశారని, నాలుగైదు ఏళ్ల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని.. కోర్టు సిబ్బంది తెలిపారు.

కాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయవతి స్పందించారు. ఈ ఘటన చాలా విచారకరం.. సిగ్గుచేటు అంటూ ట్విట్ చేశారను. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం శాంతి భద్రతలపై దృష్టిసారించాలంటూ హితవు పలికారు.

Also Read:

Crime News: సొంతింటిపైనే కోడలి కన్ను.. కోటి విలువైన బంగారం, నగదు చోరీ.. ఎవరికి తెలియకుండా..

Satya Pal Malik: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు.. గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు..

Devaragattu: కర్రల సమరంలో భగ్గుమన్న పాత కక్షలు.. సీసీటీవీలో దుండగులను గుర్తించిన పోలీసులు..