Satya Pal Malik: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు.. గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు..

Satya Pal Malik on Farm Laws: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

Satya Pal Malik: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు.. గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు..
Satya Pal Malik
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2021 | 5:23 PM

Satya Pal Malik on Farm Laws: రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన చేస్తున్న రైతుల డిమాండ్లను నెరవేర్చాలని సత్య పాల్ మాలిక్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు చేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్.. చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతుల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదంటూ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గ్రామాల్లోకి కూడా నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. తాను మీరట్‌నుంచి వచ్చానని.. రైతు సమస్యను పరిష్కరించకపోతే.. తన ప్రాంతంలోని ఏ గ్రామంలో కూడా బీజేపీ నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. ఒక్క మీరట్‌లోనే కాదు ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌ ఇలా రైతు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించలేరంటూ ఆయన మీడియాతో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొందరి మాటలు విని రైతు సమస్యను సాగదీస్తోందని.. ఇలాంటి వారి వల్లే మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తే ఆటోమేటిక్‌గా రైతు ఉద్యమం ముగుస్తుందంటూ ఆయన సలహా ఇచ్చారు. ఎంఎస్‌పీ ఇస్తామని హామీ ఇవ్వడానికి కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు 10 నెలలుగా ఇళ్లు, కుటుంబాలను వదిలి వీధుల్లో కూర్చున్నారని.. వారి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరారు. మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడ్డానని.. రైతుల కోసం ప్రధాని, హోం మంత్రితో పోరాడానంటూ పేర్కొన్నారు. ఉద్యమంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఎవరైనా కోరితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సత్యపాల్‌ మాలిక్ స్పష్టంచేశారు.

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ప్రశ్నించగా.. ఘటన జరిగిన మరుసటి రోజునే అజయ్‌ మిశ్రా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఆయన కేంద్ర మంత్రి పదవికి పనికిరారంటూ వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతుగా పదవిని వదులుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తన పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని.. అవసరమైతే వదులుకుంటానని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత సత్యపాల్‌ మాలిక్‌.. రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

Also Read:

Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Aryan Drug Case: ముంబై నుంచి నేపాల్ చేరిన డ్రగ్స్ పార్టీ కేసు.. మరో ఇద్దరు స్మగ్లర్లను విచారిస్తున్న అధికారులు

Devaragattu: కర్రల సమరంలో భగ్గుమన్న పాత కక్షలు.. సీసీటీవీలో దుండగులను గుర్తించిన పోలీసులు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..