Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..

Sisters Mysterious Death: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతి చెందారు. ఉన్నట్లుండి అనారోగ్యం

Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2021 | 4:34 PM

Sisters Mysterious Death: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతి చెందారు. ఉన్నట్లుండి అనారోగ్యం పాలైన ముగ్గురు బాలికలు.. 24 గంటల వ్యవధిలోనే మరణించడం అందరిని కలిచివేస్తోంది. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో అర్థం కావడం లేదని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాయ్‌బరేలీ పోలీసులు తెలిపారు. మరణించడానికి ముందు ఆ బాలికలు బిస్కెట్లు, నామ్‌కిన్ చిప్స్ తిన్నారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన నవీన్‌ కుమార్‌ సింగ్‌కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం వరకు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆరోగ్యంగా ఉన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం బాలికలు బిస్కెట్లు, చిప్స్‌ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురూ అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో చిన్నారుల తండ్రి నవీన్‌ కుమార్‌ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి కూడా మృతి చెందింది. చిన్నారులకు శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.

చిన్నారుల మృతి గురించి పోలీసులకు సమాచారం తెలియడంతో.. గ్రామానికి చేరకుని మృతదేహాలను వెలికితీశారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు బరేలీ ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. కాగా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరీక్షలో వెల్లడయ్యినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్‌ శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

Crime News: సొంతింటిపైనే కోడలి కన్ను.. కోటి విలువైన బంగారం, నగదు చోరీ.. ఎవరికి తెలియకుండా..

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..