Electronic Nose: కేన్సర్ వ్యాధిని గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు.. నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసేయొచ్చు.. ఇదెలా పనిచేస్తుందంటే..

ఏదైనా ఒక వ్యాధిని తేలికగా గుర్తించే విధానం ఉంటె దానివలన ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వేగంగా రోగ నిర్ధారణ జరిగితే దానిని సమర్ధవంతంగా నిర్మూలించే అవకాశం పెరుగుతుంది.

Electronic Nose: కేన్సర్ వ్యాధిని గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు.. నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసేయొచ్చు.. ఇదెలా పనిచేస్తుందంటే..
Electronic Nose
Follow us

|

Updated on: Oct 18, 2021 | 5:39 PM

Electronic Nose: ఏదైనా ఒక వ్యాధిని తేలికగా గుర్తించే విధానం ఉంటె దానివలన ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వేగంగా రోగ నిర్ధారణ జరిగితే దానిని సమర్ధవంతంగా నిర్మూలించే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు.. కరోనా వంటి వేగంగా విస్తరించే వ్యాధులను నిలువరించడానికి కూడా వేగంగా రోగ నిర్ధారణ జరగడం చాలా ముఖ్యం. అందుకే వ్యాధులను గుర్తించడానికి కొత్త రకాల పరీక్షలను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రానిక్ ముక్కును అబివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. కాలేయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు కాన్సర్ వంటి వ్యాధులను ఈ ఎలక్ట్రానిక్ ముక్కు ద్వారా గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. వ్యాధులను తనిఖీ చేయడానికి, ఇ-ముక్కును మాస్క్ లాగా మన ముక్కు పై అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనిని అమర్చుకున్న కొద్ది సెకన్లలోనే ఆ వ్యాధిని గుర్తించవచ్చు.

యూకేకి చెందిన బయోటెక్ కంపెనీ ఉల్‌స్టోన్ మెడికల్, దీనిని సిద్ధం చేసింది. ఎలక్ట్రానిక్ ముక్కు (ఇ-ముక్కు) సహాయంతో కోవిడ్‌ను గుర్తించే పని కూడా జరుగుతోందని చెప్పారు. పరిశోధనల ప్రకారం, సాధారణంగా రోగికి రక్తం, మూత్రం, మలం నమూనాలను ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ,ఈ కొత్త పరీక్ష రోగులకు చాలా సులువుగా ఉంటుందని అదేవిధంగా వ్యాధి నిర్ధారణకు తక్కువ సమయం పడుతుంది.

ఎలక్ట్రానిక్ ముక్కు ఎలా పనిచేస్తుందంటే..

ఈ ఇ-ముక్కు రోగి శ్వాస నుండి వచ్చే వ్యాధి వాసనను గుర్తించడం ద్వారా వ్యాధిని గుర్తిస్తుంది. మానవులు ఊపిరి పీల్చినప్పుడు, అందులో 3500 కంటే ఎక్కువ అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు (VOC లు) ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా చిన్న గ్యాస్ రేణువులు అదేవిధంగా సూక్ష్మ బిందువులను కలిగి ఉంటుంది. ఇ-ముక్కు అస్థిర సేంద్రీయ సమ్మేళనాలలో ఉండే రసాయనాలను గుర్తించి వ్యాధులను గుర్తిస్తుంది.

పరికరాన్ని రూపొందించడానికి 51 సంవత్సరాలు పట్టింది..

దీనిని అభివృద్ధి చేయాలనే ఆలోచన 1970 లోనే శాస్త్రవేత్తలకు వచ్చింది. కానీ, ఈ ఆలోచనను సున్నితమైన పరికరంగా మార్చడానికి దశాబ్దాలు పట్టింది. అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను గుర్తించడానికి ప్రోగ్రామింగ్, సెన్సార్ రూపకల్పన చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని విచారణ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది. ముఖ్యంగా యూకేలో ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి.

వచ్చే ఐదేళ్లలో ఈ-ముక్కు ద్వారా చేసే పరీక్ష సాధారణ పరీక్షలాగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై నిరంతర పరిశోధన జరుగుతోంది. వ్యాధి ప్రకారం రోగికి ఏ ఔషధం మంచిదో కూడా ఈ పరికరం తెలియజేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ టెక్నిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం..

ఈ టెక్నిక్ ద్వారా, ప్రపంచానికి సంబంధించిన అనేక దేశాలలో శ్వాస సంబంధిత క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో క్యాన్సర్‌కు సంబంధించిన ట్రయల్స్ కూడా ఉన్నాయి. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ట్రయల్ లక్ష్యం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మరియు ఎన్ హెచ్ ఎస్ (NHS) ఫౌండేషన్ సహకారంతో యూకే (UK) ఆసుపత్రులలో 4000 మంది రోగులపై ట్రయల్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!

Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!

Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!