AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గేదేలే అంటోన్న ఇస్రో.. ఒకటి కాదు రెండు కాదు..10 ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం..!

2025లోనూ అస్సల్‌ తగ్గేదేలే అంటోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO). 2024 ఇచ్చిన జోష్‌తో 2025లోనూ మరిన్ని కీలక ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా పది ప్రయోగాలకు గ్రౌండ్‌ వర్క్‌ చేస్తోంది ఇస్రో. ఈ ఏడాది ఇస్రో నాలుగు PSLV, మరో నాలుగు GSLV, మూడు GSLV మార్క్‌ 3 ప్రయోగాలు చేపట్టబోంది ఇస్రో. దీంతో 2025లో కూడా అస్సల్‌ తగ్గేదేలే అంటున్నారు భారత శాస్త్రవేత్తలు.

తగ్గేదేలే అంటోన్న ఇస్రో.. ఒకటి కాదు రెండు కాదు..10 ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం..!
ISRO
Balaraju Goud
|

Updated on: Jan 03, 2025 | 8:14 AM

Share

2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్‌, ఆదిత్య ఎల్‌-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన తలెత్తుకుని నిలబడేలా స్థాయికి వెళ్లింది. సొంత ఉపగ్రహాలనే కాదు… విదేశీ షాటిలైట్స్‌నూ నింగిలోకి పంపి కమర్షియల్‌గానూ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది ఇస్రో. అలాగే 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. అంతా ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ ఏడాది ఇస్రో నాలుగు PSLV, మరో నాలుగు GSLV, మూడు GSLV మార్క్‌ 3 ప్రయోగాలు చేపట్టబోంది ఇస్రో. ఇందులో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ఇస్రో NISAR ప్రయోగం చేపట్టబోతోంది. ఇప్పటికే దీని బడ్జెట్‌ 12వేల 505 కోట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రయోగం ఉండే ఛాన్స్‌ ఉంది. ఈ నాసా ఇస్రో సింథటిక్‌ అపర్చర్ రాడార్‌ తక్కువ భూకక్ష్యలో తిరుగుతూ భూమిని 12 రోజుల్లో చుట్టేయగలదు. ఇది భూమికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. భూమిపై ఉన్న సముద్రాల్లో వచ్చే మార్పులు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులను వెంటనే పసిగట్టి సమాచారం ఇస్తుంది. అవసరమైతే షాటిలైట్‌ చిత్రాలను పంగలదు. దీంతో ఈ ప్రయోగాన్ని ఇటు ఇస్రో అటు నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఇక గత దశాబ్ధంగా ఇస్రో నాలుగు వందల మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కమర్షియల్‌ షాటిలైట్‌ వెహికిల్స్‌ను లాంచ్‌ చేయడం ద్వారా సంపాదించింది. అమెరికాకు కూడా 172 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగాలతో సత్తా చాటనుంది. ఎన్‌వీఎస్‌ 2 నేవిగేషన్‌ శాటిలైట్‌, ఎల్‌వీయమ్‌ 3 అండ్‌ ఎమ్‌5 మిషన్‌ను కూడా షెడ్యూల్‌ చేసింది. దీంతో 2025లో కూడా అస్సల్‌ తగ్గేదేలే అంటున్నారు శాస్త్రవేత్తలు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు