ఆఫ్‌లైన్‌లో మీ వాట్సాప్‌ డేటాను ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు ఎలా పంపుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌లో స్టోర్‌ చేసుకునే డేటాకు కూడా..

ఆఫ్‌లైన్‌లో మీ వాట్సాప్‌ డేటాను ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు ఎలా పంపుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
Whatsapp Data
Follow us

|

Updated on: Oct 18, 2021 | 5:33 PM

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌లో స్టోర్‌ చేసుకునే డేటాకు కూడా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ ఆప్షన్‌ను అందించింది. అంటే ఇకపై క్లౌడ్‌లో స్టోర్‌ అయిన డేటా కూడా అత్యంత భద్రంగా ఉంటుందన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మనం ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు మీ డేటాను పంపించుకోవడానికి గూగుల్‌ డ్రైవ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ వాట్సాప్‌ డేటాను ఒక మొబైల్‌ నుంచి మరో మొబైల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? ఆఫ్‌లైన్‌ విధానంలో డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ ఫాలో అవ్వాలి..

స్టెప్‌ 1:

మొదటి స్టెప్‌లో భాగంగా వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి.. పైన కనిపించే త్రి డాట్స్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్‌/చాట్‌/చాట్‌బ్యాకప్‌లోకి వెళ్లి.. ‘బ్యాకప్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం లోకల్‌ బ్యాకప్‌ క్రియేట్‌ అవుతుంది. ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీలో లోకల్‌ బ్యాకప్‌ ఫోల్డర్‌ క్రియేట్‌ అయిన వెంటనే పాత ఫోన్‌లో నుంచి వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి.

స్టెప్‌ 2:

రెండవ స్టెప్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్‌లో RAR లేదా మరేదైనా ఫైల్‌ కంప్రెషన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మన మొత్తం వాట్సాప్‌ డేటాను కంప్రెస్‌ చేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

స్టెప్‌ 3:

RAR యాప్‌ ఓపెన్‌ చేస్తే.. ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ డైరెక్టరీ కనిపిస్తుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ మీడియాలో ‘కామ్‌.వాట్సాప్‌’ ఫోల్డర్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం అర్చివ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే మొత్తం ఫోల్డర్‌ .rar ఫైల్‌లోకి మారుతుంది.

స్టెప్‌ 4:

ఇలా డేటాను .rar ఫైల్‌లోకి మార్చిన తర్వాత.. పాత ఫోన్‌లోని ఈ ఫైల్‌ను మీ కొత్త ఫోన్‌లోకి పంపించుకోవాలి.

స్టెప్‌ 5:

తర్వాత కొత్త మొబైల్‌ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్‌లో భాగంగా గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌ను స్కిప్‌ చేయాలి. దీంతో వాట్సాప్‌ యాప్‌లో ఉన్న లోకల్‌ బ్యాకప్‌లోని డేటాను డిటెక్ట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లోకి ఇంపోర్ట్‌ అవుతాయి. ఇలా మీ పాత ఫోన్‌లోని వాట్సాప్‌ డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వచ్చేస్తుంది.

Also Read: మహిళలు జాగ్రత్త..! గర్భధారణ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..?

Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..

TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు