మహిళలు జాగ్రత్త..! గర్భధారణ సమయంలో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..?
Women Beware: గర్భధారణ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ అయ్యే అవకాశాన్ని అస్సలు కోల్పోకూడదు. అందుకే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Women Beware: గర్భధారణ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ అయ్యే అవకాశాన్ని అస్సలు కోల్పోకూడదు. అందుకే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఏ ఆహారం తీసుకున్నా అది కడుపులో ఉండే బిడ్డపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఈ సమయంలో హార్మోన్ల కారణంగా గర్భిణీ స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భధారణ అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. తినడంలో తాగడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఈ ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.
1. బొప్పాయి గర్భిణీలు బొప్పాయి పండు తినవద్దు. ఎందుకంటే బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయిలో గర్భాశయ సంకోచాన్ని పెంచే లక్షణాలు ఉంటాయి. నెలలు నిండకముందే ప్రసవ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.
2. మద్యం గర్భిణీలు మద్యం సేవించకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది గర్భంలో పెరుగుతున్న పిల్లల మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. మద్యం తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
3. పచ్చి గుడ్డు గర్భిణీలు పచ్చి గుడ్లు తినకూడదు. ముడి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది ఇది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం మొదలైన వాటికి కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు సాల్మొనెల్లా బాక్టీరియా శిశువుకు హాని కలిగిస్తుంది.
4. కలబంద గర్భధారణ సమయంలో కలబందను తీసుకోకూడదు. ఇది గర్భాన్ని పాడు చేస్తుంది. అయితే గర్భధారణ సమయంలో అలోవెరా క్రీమ్ రాసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు.
5. కాఫీ గర్భిణీ స్త్రీలు తరచుగా టీ, కాఫీ తాగుతారు. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. అంతేకాదు బిడ్డ పుట్టిన సమయంలో బరువు తగ్గడానికి కారణమవుతుంది.