Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పిపై నిర్లక్ష్యం వద్దు..! లేదంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.. తెలుసుకోండి..

Headache: దైనందిన జీవితంలో మనం చాలాసార్లు తలనొప్పితో బాధపడుతాం. కానీ నిరంతర తలనొప్పి వల్ల సమస్య జఠిలమవుతుంది. మానవులలో 150 రకాల తలనొప్పులు వస్తాయి.

తలనొప్పిపై నిర్లక్ష్యం వద్దు..! లేదంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.. తెలుసుకోండి..
Headache
Follow us
uppula Raju

|

Updated on: Oct 18, 2021 | 5:10 PM

Headache: దైనందిన జీవితంలో మనం చాలాసార్లు తలనొప్పితో బాధపడుతాం. కానీ నిరంతర తలనొప్పి వల్ల సమస్య జఠిలమవుతుంది. మానవులలో 150 రకాల తలనొప్పులు వస్తాయి. ఇందులో మీకు వచ్చేది ఏ రకమైన తలనొప్పియో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే సరైన చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల తలనొప్పుల గురించి తెలుసుకుందాం.

1. టెన్షన్ తలనొప్పి మెడికల్ వెబ్‌సైట్ ప్రకారం ఇది సాధారణ తలనొప్పి. ఇది తరచుగా పెద్దలు, కౌమారదశలో ఉండే పిల్లలకు సంభవిస్తుంది. ఇందులో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఈ తలనొప్పికి ప్రధాన కారణం ఒత్తిడి.

2. మైగ్రేన్ తలనొప్పి మైగ్రేన్ నొప్పి చాలా పదునైనది మరియు భరించలేనిది. ఈ రకమైన నొప్పి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఈ రకమైన నొప్పి నెలలో 3 నుంచి 4 సార్లు వస్తుంది. ఈ నొప్పి ప్రత్యేక లక్షణం ఏమిటంటే కొన్ని ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కాంతి వల్ల, పెద్ద శబ్దం వల్ల అసౌకర్యంగా ఫీలవుతారు. వాంతులు, ఆందోళన, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మొదలైనవి ఉంటాయి.

3. క్లస్టర్ తలనొప్పి ఈ తలనొప్పి రోజులో చాలాసార్లు వస్తుంది. ఇది అత్యంత తీవ్రమైన భరించలేని నొప్పి. బాధితుడి కళ్ల చుట్టూ మండుతున్నట్లు, కుట్టినట్లు అనిపిస్తుంది. కళ్ళు పొడిబారడం, ఎర్రబడటం, నిరంతర నీళ్లు కారడం లక్షణాలుగా ఉంటాయి. ఈ తలనొప్పి వ్యవధి 2 వారాల నుంచి 3 నెలల వరకు ఉంటుంది.

4. సైనస్ తలనొప్పి సైనస్ నొప్పి స్థిరంగా ఉంటుంది అంతేకాక చాలా పదునైనది. ఇది చెంప ఎముకలు, నుదిటి లేదా ముక్కు ఎగువ ఉపరితలంపై నొప్పిగా ఉంటుంది. నుదిటిలో కనిపించే కుహరంలో (సైనస్) వాపు కారణంగా ఈ తలనొప్పి వస్తుంది. ముక్కు కారటం, చెవి నొప్పి, జ్వరం, ముఖం వాపు వంటి లక్షణాలు ఉంటాయి. ముక్కు నుంచి కఫం లాంటి పదార్ధం బయటకు వస్తుంది ఇది ఆకుపచ్చ, పసుపు రంగులో ఉంటుంది.

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులు తస్మాత్‌ జాగ్రత్త.. ఇలా చేశారో ఇక మీ పని అంతే సంగతులు..

Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!

Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు