Rose Tea: గులాబీ టీతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Weight loss drink Rose Tea: ఆధునిక ప్రపంచంలో చాలా ఊబకాయం బారిన పడి సతమతమవుతున్నారు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటించడంతోపాటు..

Rose Tea: గులాబీ టీతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..
Rose Tea
Follow us

|

Updated on: Oct 18, 2021 | 7:41 PM

Weight loss drink Rose Tea: ఆధునిక ప్రపంచంలో చాలా ఊబకాయం బారిన పడి సతమతమవుతున్నారు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటించడంతోపాటు.. నిత్యం వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. అయితే.. అధిక బరువు ఉన్నవారు పలు రకాల డైట్లను పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు. దీంతోపాటు గులాబీ పువ్వు నుంచి తయారయ్యే టీని తాగితే సలువురుగా బరువు తగ్గొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గులాబీ పువ్వు.. అందానికి, సువాసనకు ప్రసిద్ధే కాదు.. ఔషధం కూడా. గులాబీ టీ వేగవంతంగా బరువు తగ్గడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. బరువు తగ్గించేలా చేయడంతోపాటు పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని.. ఆయూర్వేద టీ లల్లో ఇది ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజ్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుందని, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోజ్ టీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ అపురూపమైన వాసన స్ట్రెస్ బస్టర్‌గా కూడా పనిచేసి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇప్పుడు రోజ్ టీ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

గులాబీ టీ ఊబకాయానికి చెక్.. రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేందుకు కీలకంగా మారుతాయి.

మెరుగైన జీర్ణ వ్యవస్థ.. రోజ్ టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కీలకం. కావున రోజూ రెండు కప్పుల రోజ్‌ టీ తాగడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు.

టాక్సిన్స్ తొలగిస్తుంది. రోజ్ టీ మీ శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో శరీరంలోని కోవ్వు సులువుగా తగ్గుతుంది.

ఆకలిని నిరోధిస్తుంది.. ఇది కెఫిన్ లేని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ పానీయం. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

రోగనిరోధక శక్తి.. రోజ్ టీ మిమ్మల్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచి.. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

రోజ్ టీ తయారీ విధానం.. ఒకటి లేదా రెండు గులాబీలను తీసుకోవాలి. రెండు కప్పుల నీటిలో గులాబీ పువ్వులు వేయాలి. 10 నిమిషాలపాటు మరిగిన అనంతరం ఈ నీటిని ఫిల్టర్ చేసి ఒక కప్పులో తీసుకోవాలి. ఆ నీటిలో కొంచెం తేనె, నిమ్మరసం వేసి కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే మంచిది. ఈ టీని రోజూ తాగితే బరువు తగ్గడంతోపాటు.. చర్మం మెరుస్తుంది.

Also Read:

తలనొప్పిపై నిర్లక్ష్యం వద్దు..! లేదంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.. తెలుసుకోండి..

Pomegranate Leaves: సీజనల్ దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారు.. అయితే దానిమ్మ ఆకులతో ఇలా చేసి చూడండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో