Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Least Sleeping: బలవంతంగా నిద్ర పక్కన పెట్టి టీవీ చూస్తున్నారా? ఇది చాలా ప్రమాదం..ఎందుకంటే..

ఉరుకులు పరుగుల జీవితంలో మన అలవాట్లు మారిపోతున్నాయి. ఆహారం.. నిద్ర.. ఇలా ప్రతి అలవాటులోనూ విపరీతమైన మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిద్ర విషయంలో భారతీయుల దిన చర్య పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు

Least Sleeping: బలవంతంగా నిద్ర పక్కన పెట్టి  టీవీ చూస్తున్నారా? ఇది చాలా ప్రమాదం..ఎందుకంటే..
Least Sleeping
Follow us
KVD Varma

|

Updated on: Oct 18, 2021 | 7:52 PM

Least Sleeping: ఉరుకులు పరుగుల జీవితంలో మన అలవాట్లు మారిపోతున్నాయి. ఆహారం.. నిద్ర.. ఇలా ప్రతి అలవాటులోనూ విపరీతమైన మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిద్ర విషయంలో భారతీయుల దిన చర్య పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. పనిలో పడిపోవడం వలన చాలామంది తమ నిద్రకు దూరం అవుతుండటం ఒక ముఖ్య కారణం అయితే.. కొంతమంది ఇంకా చెప్పాలంటే చాలా మంది ఎలక్ట్రానిక్ డివైస్ లకు అలవాటు పడి నిద్రపోగలిగే అవకాశం ఉన్నప్పటికీ బలవంతంగా మెలకువగా ఉంటున్నారు. దీనిని దీనిని రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొక్రెస్టినేషన్ అని పిలుస్తారు. అంటే నిద్రను బలవంతంగా ఆపుకోవడం. ఇది శరీర ఆరోగ్యంతో పాటు, సంబంధాల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తోంది.

రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొక్రెస్టినేషన్ అంటే..

యుఎస్ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చేసిన సర్వేలో, రోజంతా ఎక్కువ పని చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత కూడా ప్రజలు సరదాగా ఆలస్యంగా ఉంటారని తేలింది. రాత్రిపూట బలవంతంగా మేల్కొనే ధోరణి భారతీయ యువతలో పెరిగింది. అదీ వారు పని లేకుండా అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటారు. ఈ కారణంగా మనం ప్రపంచంలో నిద్రలేని రెండవ దేశంగా అవతరించాము. “అయితే, రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొక్రెస్టినేషన్” అనేది 2016 లో చైనాలో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఇంటర్నెట్ పదబంధం. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు పరిశోధకులు టివిని రిలీఫ్ టైమ్‌గా చూస్తూ అలసిపోయిన రోజు తర్వాత, ప్రజలు తాము రిలాక్స్ అవుతున్నట్లు భావించి గంటల తరబడి మేల్కొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. ఈ సైకాలజీ కారణంగా, వారు నిద్రతో రాజీపడతారు.

నష్టాలు ఏమిటి?

అది మన ఆరోగ్యానికి హాని కలిగించడమే కాదు, అనేక విధాలుగా అది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రాత్రి ఆలస్యంగా ఉండడానికి కారణం ఫోన్‌లో అర్థరాత్రి ఎవరితోనైనా మాట్లాడటం, చాట్ చేయడం లేదా ఒటీటీ (OTT)లో సిరీస్ చూడటం. నిద్ర లేమి మీరు అనుకున్నదానికంటే చాలా హానికరం. ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా నిద్రపోవడం నిద్రలేమి వంటి వ్యాధి కాదు. కానీ, అది నిరంతరం నిద్ర లేకపోవడం.. దాని నుండి ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలకు దారితీస్తుంది.

నిద్ర విషయంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు..

పురుషులు కంటే భారతీయ మహిళలు తక్కువ నిద్రపోతారు. వారు గృహ, ఆఫీసు పనిలో చాలా నిమగ్నమై ఉండడం వల్ల వారికి అవసరమైన నిద్ర పొందే అవకాశం లభించదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, 11 శాతం మంది పురుషులు, 13 శాతం మంది మహిళలు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, సగటున, పురుషుల కంటే మహిళలకు 11 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం. పురుషులకు 8 గంటల నిద్ర అవసరమైతే, మహిళలు ప్రతిరోజూ 8 గంటల 11 నిమిషాలు నిద్రపోవాలి. లేకుంటే వారి ఆరోగ్యం ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది.

క్షీణిస్తున్న సంబంధాలు

ఒక ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి సరయు(పేరు మార్చబడింది), తన భర్త తనకు సమయం ఇవ్వకుండా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆమె భర్త నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటారు. వారు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి, ఆపై వీడియో కాలింగ్ లేదా సామాజిక సైట్లలో నిమగ్నమై ఉంటారు. అతను తన వ్యక్తిగత పనులపై ఏమాత్రం ఆసక్తి చూపించరు. ఈ కారణంగా మా సంబంధం చెడిపోయింది అని చెప్పారు.

మనస్తత్వవేత్తలు చెప్పేది ఇదే..

మనస్తత్వవేత్తలు ఈ విషయంపై మాట్లాడుతూ, ”పగటిపూట ఎక్కువ ఖాళీ సమయం లభించని వ్యక్తులు సాధారణంగా రాత్రిపూట ఎక్కువగా మేలుకుని ఉంటారు. వారు బలవంతంగా మేల్కొంటారు. ఫోన్‌లో సోషల్ మీడియా చూడటం లేదా టీవీ చూడటం వంటివి చేస్తారు. వారు నేను ఇంతసేపు కష్టపడి పనిచేశాను. నాకు వినోదంతో విశ్రాంతి దొరుకుతుంది అనుకుని రాత్రి సమయంలో చాలాసేపటి వరకూ టీవీ లేదా ఫోన్ లో సినిమాలు.. ఆటలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. వారు ఇది తమకు విశ్రాంతి ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా యువతలో ఈ విధమైన అలవాటు కనిపిస్తుంది. అయితే, ఇది పూర్తిగా తప్పు.” అని అంటున్నారు. ఎందుకంటే.. కళ్ళు మెదడుకు దగ్గర బంధువులు. కళ్ళతో మనం చూసేది ఏదైనా మెదడు మీద నేరుగా.. వేగంగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల నిద్ర పోయి లేచిన తరువాత మనసు ఆహ్లాదంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిద్రను పక్కన పెట్టి టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపితే కళ్ళు అలిసిపోతాయి. అంటే, మన మెదడు కూడా అలిసిపోతుంది. సమయానుసారంగా నిద్ర పోకుండా.. గంటలు లెక్క చెప్పి తెల్లవారుజాము నుంచి పగలు ఎక్కువసేపు నిద్ర పోవడం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. రాత్రి సమయంలో నిద్ర లేకపోవడంతో వచ్చే సమస్యలకు తోడుగా స్క్రీన్ టైం పెరగడం వలన మరింత ఇబ్బంది పెరుగుతుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

నిద్రను వాయిదా వేసి టీవీ చూస్తే..

రాత్రి సమయంలో కనీసం ఐదు గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఎనిమిది గంటలు నిద్రపోయే సమయం కదా అని తెల్లవారే వరకూ టీవీ చూసి ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటలు పడుకున్నా ఫలితం ఉండదు. ఇటువంటి నిద్ర వలన ఈ అనారోగ్య లక్షణాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

  • గుండె సమస్యలు
  • బరువు పెరుగుతోంది
  • డయాబెటిస్ ప్రమాదం
  • హార్మోన్ అసమతుల్యత
  • రోగనిరోధక శక్తి తగ్గింది
  • మానసిక అనారోగ్యం ప్రమాదం

స్వల్ప కాలంలో ఇవి కనిపించకపోయినా.. దీర్ఘకాలంలో అంటే వయసు పెరిగే కొలదీ ఈ వ్యాధులు కొన్నైనా నిద్రను బలవంతంగా ఆపుకుని టీవీలతో కాలక్షేపం చేసేవారికి తప్పనిసరిగా ఈ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేయండి..

మీ పని అయిపోయిన తరువాత ఫోన్ తో సహా అన్ని స్క్రీన్ ఉపకరణాలను నిలిపివేయండి. పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాలు ధ్యానం చేయండి. ఒక గ్లాసు వేడి పాలు తాగండి. ప్రశాంతంగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి. మొదట్లో ఇది ఇబ్బందిగానే ఉంటుంది. టీవీలో వచ్చే కార్యక్రమాలపై మనసు పోతుంది. కానీ, దానికంటే ఆరోగ్యం ముఖ్యమనే విషయం గుర్తుంచుకోండి. టీవీలో వచ్చే కార్యక్రమాలు మర్నాడు ఉదయం కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ, ఈరోజు కోల్పోయిన నిద్ర.. బలవంతంగా నిద్రను ఆపుకోవడం వలన వచ్చిన ఇబ్బంది మర్నాడు రికవరీ కావు అనేది పచ్చి నిజం. వైద్య నిపుణులు చెప్పేది అదే. అందుకే.. జాగ్రత్తగా ఉండండి. మీలో ఉన్న ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొక్రెస్టినేషన్’ పారద్రోలండి.

ఇవి కూడా చదవండి: TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!

Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!

Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!