Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!

ఇంటర్నెట్..స్మార్ట్‌ఫోన్‌ల ఈ కాలంలో, యూజర్ డేటా సేకరణ.. దాని దుర్వినియోగం గురించి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే ఎదో రకంగా మన డేటా చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!
Smart Phone Pre Install Apps
Follow us
KVD Varma

|

Updated on: Oct 18, 2021 | 3:31 PM

Pre Install Apps: ఇంటర్నెట్..స్మార్ట్‌ఫోన్‌ల ఈ కాలంలో, యూజర్ డేటా సేకరణ.. దాని దుర్వినియోగం గురించి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే ఎదో రకంగా మన డేటా చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకునే యాప్ లు రకరకాల అనుమతులు కోరతాయి. దాని తరువాత మనం అనుమతి ఇస్తేనె అవి మన ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతాయి. కానీ.. ఫోన్ తో పాటు వచ్చే డిఫాల్ట్ యాప్‌ల మాటేమిటి? మనం ఫోన్ కొన్నపుడు దానితో పాటు కొన్ని యాప్ లు డిఫాల్ట్ గా మన ఫోన్‌లో వస్తాయి. వాటిని మనం ఉపయోగిస్తాం. అయితే, అవి ఎటువంటి అనుమతులు మనల్ని అడగవు. కారణం అప్పటికే అవి ఇన్‌స్టాల్ అయిపోయి ఉండటం. ఎక్కువగా మన ఫోన్ లో డిఫాల్ట్‌గా వచ్చే ఫేస్‌బుక్, గూగుల్.. మైక్రోసాఫ్ట్ యాప్స్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదారుల అనుమతి లేకుండా తమ డేటాను రహస్యంగా నిల్వ చేస్తాయని కొత్త నివేదిక వెల్లడించింది.

ఈ పరిశోధన ట్రినిటీ కాలేజ్, డబ్లిన్‌లో జరిగింది. వినియోగదారుల నుంచి నిశ్శబ్దంగా ఈ యాప్ లు సంగ్రహించే డేటాలో యాప్ స్క్రీన్, వెబ్ యాక్టివిటీ, ఫోన్ కాల్స్ కోసం గడిపిన సమయం, డివైజ్ ఐడెంటిఫైయర్‌లు అలాగే హార్డ్‌వేర్ సీరియల్ నంబర్‌లు కూడా ఉంటాయి. యూనివర్సిటీ పరిశోధకులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ పరికరాలైన శామ్‌సంగ్, షియోమి, హువావే, రియాలిటీ హెడ్ సెట్, Lineage OS, e/OS లకు సంబంధించిన 6 వేరియంట్‌లకు పంపిన డేటాను పరిశీలించారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో సహా..

పరిశోధకులు ఈ అధ్యయనానికి ‘ఆండ్రాయిడ్ మొబైల్ ఓఎస్ స్నూపింగ్ బై శామ్‌సంగ్, షియోమి, హువావే మరియు రియాలిటీ హెడ్ సెట్’ అని పేరు పెట్టారు. దీని ప్రకారం, కనీస ఆకృతీకరణతో యాక్టివ్‌గా హ్యాండ్ సెట్ చేసినప్పుడు, e/OS మినహా అన్ని వేరియంట్లు మూడవ పక్షాలకు తగినంత మొత్తంలో డేటా బదిలీని అనుమతిస్తాయి. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ నుండి ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు ఉన్నాయి. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం కూడా సాధ్యం కాదు.

కంపెనీ స్మార్ట్ఫోన్ జియోమీ (Xiaom) తో వచ్చే అన్ని ప్రీ లోడెడ్ యాప్ లు ప్రతి యాప్ ఎలా వాడుతున్నారు ఎంత సమయం వాడుతున్నారు వంటి వివరాలు పంపుతుంది. ఇది వెబ్ పేజీల మధ్య వ్యక్తుల కదలికను ట్రాక్ చేసే కుకీల మాదిరిగానే ఉంటుంది. ఈ డేటా సింగపూర్.. ఐరోపా వెలుపలకు పంపినట్లు పరిశోధనలో తేలింది.

పరిశోధన ప్రకారం, హువావే (Huawei) హ్యాండ్‌సెట్‌లోని స్విఫ్ట్ కీబోర్డ్ ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ యాప్‌ల వినియోగం వివరాలను పంపుతుంది. దీనిలో వినియోగదారులు టెక్స్ట్ టైప్ చేయవచ్చు, సెర్చ్ బార్‌లో టైప్ చేయవచ్చు. కాంటాక్ట్‌ల కోసం సెర్చ్ చేయవచ్చు.

అయితే శామ్‌సంగ్, షియోమి, రియల్‌మీ, గూగుల్ హార్డ్‌వేర్ డివైస్ ఐడెంటిఫైయర్‌లైన సీరియల్ నెంబర్లు, యాడ్ ఐడెంటిటీలు స్టోర్ చేస్తాయి. వినియోగదారులు యాడ్ ఐడెంటిటీని రీసెట్ చేసినప్పటికీ కొత్త ఐడెంటిఫైయర్ విలువ ఆటోమేటిక్‌గా అదే పరికరంతో అనుబంధించి ఉందని దీని అర్థం. ఫోన్ నుండి డేటా వేర్వేరు కంపెనీలకు పంపించడానికి వీలయ్యే ఒక రకమైన పర్యావరణ వ్యవస్థ కూడా ఈ ఫోన్ లలో ఉండి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై మరింత పరిశోధన అవసరం అని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి: Ration Card: ఆరు నెలలకుపైగా రేషన్ తీసుకోవడం లేదా.. మీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి..

Motkupalli: ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ : మోత్కుపల్లి