AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safest Cars in India: భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు ఏవో తెలుసా.. టాప్ లిస్టులో ఎన్నున్నాయంటే?

ఈ పండుగ సీజన్‌లో మీ ఇంటికి కొత్త కారును తీసుకురావాలని ఆలోచిస్తున్నారా.. అయితే మంచి రేటింగ్ పాయింట్లు పొందిన, అలాగే అత్యంత సురక్షితమైన కార్లు ఏవో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Safest Cars in India: భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు ఏవో తెలుసా.. టాప్ లిస్టులో ఎన్నున్నాయంటే?
Safest Cars In India
Venkata Chari
|

Updated on: Oct 18, 2021 | 9:33 AM

Share

Safest Cars in India: ప్రయాణించేటప్పుడు భద్రత ఒక పెద్ద సమస్య. అందువల్ల, కారు కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్‌లు తరచుగా కారు భద్రతా లక్షణాల గురించి తనిఖీలు చేస్తుంటారు. ఈ పండుగ సీజన్‌లో మీ ఇంటికి కొత్త కారును తీసుకురావాలని ఆలోచిస్తున్నారా.. అయితే టెస్టింగ్‌లో మంచి రేటింగ్ పాయింట్‌‌లతోపాటు అత్యతం సురక్షితమైన కార్లు ఏవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు టెన్షన్ లేకుండా హాయిగా ప్రయాణించగల కార్లు ఏవో ఇక్కడ తెలియజేస్తున్నాం.

టాటా పంచ్ టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ భద్రత పరంగా చాలా మెరుగ్గా ఉంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. టాటా పంచ్ పిల్లల సేఫ్టీ పరంగా 49 పాయింట్లకుగాను 40.89 పాయింట్లను పొందింది. పరీక్ష సమయంలో డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడ, మోకాలు, ఛాతీని బాగా రక్షించడంలోనూ తన ‘పంచ్’ చూపించి అత్యధిక పాయింట్లు సాధించింది. దీంతో టాటా పంచ్ సేఫ్టీ పరంగా అత్యంత సురక్షితమైందిగా గుర్తించారు.

మహీంద్రా XUV300 గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా XUV300 కూడా మంచి పాయింట్లు సాధించింది. పెద్దవారి రక్షణ విషయంలో 17 కిగాను 16.42 పాయింట్లు, అలాగే పిల్లల సేఫ్టీ పరంగా 49 పాయింట్లలో 37.44 పాయింట్లు సాధించారు. ఈ మహీంద్రా కారు పెద్దల విషయంలో మంచి రేటింగ్ పాయింట్లను సాధించింది. ఈ కారులో కూర్చున్న వ్యక్తుల తల, మెడ, మోకాళ్లు, ఛాతీ భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ భద్రత విషయంలో చాలా మెరుగైనదిగా నిలిచింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌లు పొందిన దేశంలో తయారు చేసిన మొదటి కారు ఇదే కావడం విశేషం. పెద్దవారి రక్షణలో ఈ ఎస్‌యూవీ 17 పాయింట్లకుగాను 16.06 పాయింట్లను పొందింది. అలాగే పిల్లల సేఫ్లీ విషయంలో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే ఈ కారు పిల్లల భద్రతాలో 49 పాయింట్లలో 25 పాయింట్లను పొందింది.

Also Read: Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల్లో బిగ్ రిలీఫ్ ఇచ్చిన చమురు కంపెనీలు..

Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..

Mahindra: బొలెరో, స్కార్పియో, జైలో మహీంద్రా ప్రతి వాహనం పేరు చివరలో ఓ ఎందుకు వస్తుందో తెలుసా..

SUVలపై పెరుగుతోన్న మోజు.. సెడాన్‌, హ్యాచ్‌బ్యాక్‌‌లను మించిన అమ్మకాలు.. బెస్ట్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలు, వాటి డిస్కౌంట్లు మీకోసం..!

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!