SUVలపై పెరుగుతోన్న మోజు.. సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌లను మించిన అమ్మకాలు.. బెస్ట్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలు, వాటి డిస్కౌంట్లు మీకోసం..!
Best Discounts On Compact SUVs: SIAM డేటా ప్రకారం 87,720 SUV లు సెప్టెంబర్ 2021 లో విక్రయించగా, అదే కాలంలో 64,235 సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు మాత్రమే అమ్ముడయ్యాయంట.
Best Discounts On Compact SUVs: జులై నుంచి సెప్టెంబర్ నెలలో SUV విభాగంలో ప్రజలు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల కంటే ఎక్కువ కార్లను కొనుగోలు చేశారు. SIAM డేటా ప్రకారం 87,720 SUV లు సెప్టెంబర్ 2021 లో విక్రయించగా, అదే కాలంలో 64,235 సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు మాత్రమే అమ్ముడయ్యాయంట. ఈ ధోరణి 2021-22 రెండవ త్రైమాసికంలో కూడా కొనసాగిందని పేర్కొంది. 3,67,457 యూనిట్ల SUVలు విక్రయించారని తెలిపింది.
దీనిని దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్‌లో కాంపాక్ట్ SUV లో లభించే డిస్కౌంట్ల గురించి తెలియజేస్తున్నాము. ఈ కార్లను కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
మహీంద్రా XUV300 ఇందులో మొదటగా మహీంద్రా XUV300 కొనుగోలుపై గరిష్టంగా రూ .44,000 తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. రూ .15,000 నగదు తగ్గింపుతోపాటు రూ .5,000 వరకు ఉచిత యాక్ససరీలు, రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను కంపెనీ అందిస్తున్నాయి.
హోండా డబ్ల్యుఆర్-వి హోండా డబ్ల్యుఆర్-వికి రూ .10,000 క్యాష్ డిస్కౌంట్, రూ .12,158 వరకు ఉచిత యాక్ససరీలు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ .5,000 లాయల్టీ బోనస్, హోండా కస్టమర్‌లకు అదనంగా రూ .9,000 ఎక్స్ఛేంజ్ లభిస్తోంది.
మారుతి వితారా బ్రెజ్జా మారుతి వితారా బ్రెజ్జా ఎస్‌యూవీకి రూ .5,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .2,500 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.
టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్ టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్ మీద కంపెనీ నగదు తగ్గింపులను అందించడం లేదు. కానీ, కంపెనీ నెక్సాన్ పై రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది. మరోవైపు, రెనాల్ట్ కిగర్‌పై రూ. 10,000 కార్పొరేట్ బోనస్, రూ .95 వేల లాయల్టీ బోనస్ అందిస్తోంది.
పొరపాటున మీ డబ్బు వేరొకరి ఖాతాకి వెళ్లిందా..! అయితే ఆర్బీఐ ఏం చెబుతుందో తెలుసుకోండి..