Smartphone Rankings: ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానం ఎవరిదో తెలుసా.. ప్రజల మనసు గెలుచుకున్న కంపెనీ ఏదంటే?
కెనాలిస్ షేర్ చేసిన డేటా ప్రకారం శాంసంగ్ ఇప్పటికి మొదటి స్థానంలో ఉంది. శాంసంగ్ 23శాతం షేర్‌తో మొదటి స్థానంలో నిలిచింది.
World Smartphone Market Rankings: ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అదే సమయంలో ఆపిల్ ఫోన్లు రెండవ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక షియోమీ మూడవ స్థానంలో నిలిచింది. 2021 మూడో త్రైమాసికంలో కంపెనీ 15శాతం మార్కెట్ వాటాను సాధించగలిగింది. కొత్త ఐఫోన్ 13 కి అధిక డిమాండ్ కారణంతో ఆపిల్ రెండో స్థానం దక్కించుకుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
23 శాతం మార్కెట్ షేర్‌తో శాంసన్ అగ్రస్థానం కెనాలిస్ షేర్ చేసిన డేటా ప్రకారం శాంసంగ్ ఇప్పటికి మొదటి స్థానంలో ఉంది. శాంసంగ్ 23శాతం షేర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఆపిల్ 15శాతం మార్కెట్ షేర్‌ను కలిగింది. అలాగే షియోమీ 14శాతం షేర్‌ను సాధించింది. వివో, ఒప్పో నాల్గవ, ఐదవ స్థానాలలో 10శాతం మార్కెట్ వాటాను పొందాయి.
కెనాలిస్ డేటా ప్రకారం మార్కెట్ షేర్లలో కంపెనీ స్థానాలు శాంసంగ్ 23 శాతం ఆపిల్ 15 శాతం షియోమీ 14 శాతం వివో 10 శాతం ఒప్పో 10 శాతం
చిప్ కొరతతో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగే అవకాశం చిప్ కొరత కారణంగా మూడవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ రవాణా 6శాతం పడిపోయిందని కెనాలిస్ నివేదిక పేర్కొంది. చిప్ కొరత 2022 వరకు కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. చిప్‌సెట్ తయారీదారులు చిప్ ధరలను పెంచడానికి ఇదే కారణం. దీంతో స్మార్ట్‌ఫోన్ ధరలకు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!