T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!

ICC T20I World Cup 2021 Schedule: అక్టోబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 12 లో రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఆతరువాత సెమీ-ఫైనల్స్‌లో నాలుగు జట్లు పోటీపడనున్నాయి.

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!
T20 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Oct 17, 2021 | 5:13 PM

T20 World Cup 2021: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్‌లో మొదలవ్వనున్నాయి. నవంబర్ 14 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొంటాయి. క్వాలిఫయర్ రౌండ్‌గా పిలువబడే మొదటి దశలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 22 వరకు జరిగే క్వాలిఫయర్ రౌండ్‌లోని జట్లు రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయి. మొదటి ఎనిమిది ర్యాంక్ సాధించిన టీంలు ఇక్కడ పోటీపడనున్నాయి.

అక్టోబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 12లో టీంలు మరోసారి రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నారు. అనంతరం సెమీ-ఫైనల్స్‌లో నాలుగు జట్లు పోటీపడనున్నాయి. సెమీ ఫైనల్స్ నవంబర్ 10, నవంబర్ 11 న జరుగుతాయి. మరోవైపు ఫైనల్ నవంబర్ 14 న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 పూర్తి షెడ్యూల్:

తేదీ ఎవరెవరి మధ్య సమయం (IST) వేదిక
17-అక్టోబర్ ఒమన్ వర్సెస్ పాపువా న్యూ గినియా 03:30 అల్ అల్మెరాట్, మస్కట్
17-అక్టోబర్ బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ 07:30 అల్ అల్మెరాట్, మస్కట్
18-అక్టోబర్ ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబూ ధాబీ
18-అక్టోబర్ శ్రీలంక వర్సెస్ నమీబియా  07:30 అబూ ధాబీ
19-అక్టోబర్ స్కాట్లాండ్ vs పాపువా న్యూ గినియా 03:30 అల్ అల్మెరాట్, మస్కట్
19-అక్టోబర్ ఒమన్ వర్సెస్ బంగ్లాదేశ్ 07:30 అల్ అల్మెరాట్, మస్కట్
20-అక్టోబర్ నమీబియా vs నెదర్లాండ్స్ 03:30 అబూ ధాబీ
20-అక్టోబర్ శ్రీలంక vs ఐర్లాండ్ 07:30 అబూ ధాబీ
21-అక్టోబర్ బంగ్లాదేశ్ vs పాపువా న్యూ గినియా 03:30 అల్ అల్మెరాట్, మస్కట్
21-అక్టోబర్ ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 అల్ అల్మెరాట్, మస్కట్
22-అక్టోబర్ నమీబియా vs ఐర్లాండ్ 03:30 అబూ ధాబీ
22-అక్టోబర్ శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 07:30 అబూ ధాబీ
23-అక్టోబర్ ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా 03:30 అబూ ధాబీ
23-అక్టోబర్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ 07:30 అబూ ధాబీ
24-అక్టోబర్ A1 vs B2 03:30 షార్జా
24-అక్టోబర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్
25-అక్టోబర్ ఆఫ్ఘనిస్తాన్ vs B1 07:30 షార్జా
26-అక్టోబర్ దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ 03:30 దుబాయ్
26-అక్టోబర్ పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ 07:30 షార్జా
27-అక్టోబర్ ఇంగ్లాండ్ వర్సెస్ బి 2 03:30 అబూ ధాబీ
27-అక్టోబర్ B1 vs A2 07:30 అబూ ధాబీ
28-అక్టోబర్ ఆస్ట్రేలియా vs A1 07:30 దుబాయ్
29-అక్టోబర్ వెస్టిండీస్ vs B2 03:30 షార్జా
29-అక్టోబర్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్
30-అక్టోబర్ దక్షిణాఫ్రికా vs A1 03:30 షార్జా
30-అక్టోబర్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా 07:30 దుబాయ్
31-అక్టోబర్ ఆఫ్ఘనిస్తాన్ vs A2 03:30 అబూ ధాబీ
31-అక్టోబర్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 07:30 దుబాయ్
1-నవంబర్ ఇంగ్లాండ్ వర్సెస్ A1 07:30 షార్జా
2-నవంబర్ దక్షిణాఫ్రికా vs B2 03:30 అబూ ధాబీ
2-నవంబర్ పాకిస్తాన్ vs A2 07:30 అబూ ధాబీ
3-నవంబర్ న్యూజిలాండ్ వర్సెస్ బి 1 03:30 దుబాయ్
3-నవంబర్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 07:30 అబూ ధాబీ
4-నవంబర్ ఆస్ట్రేలియా vs B2 03:30 దుబాయ్
4-నవంబర్ వెస్టిండీస్ vs A1 07:30 అబూ ధాబీ
5-నవంబర్ న్యూజిలాండ్ vs A2 03:30 షార్జా
5-నవంబర్ ఇండియా వర్సెస్ బి 1 07:30 దుబాయ్
6-నవంబర్ ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ 03:30 అబూ ధాబీ
6-నవంబర్ ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా 07:30 షార్జా
7-నవంబర్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 03:30 అబూ ధాబీ
7-నవంబర్ పాకిస్తాన్ వర్సెస్ బి 1 07:30 షార్జా
8-నవంబర్ ఇండియా vs A2 07:30 దుబాయ్
10-నవంబర్ సెమీ ఫైనల్ 1 07:30 అబూ ధాబీ
11-నవంబర్ సెమీ ఫైనల్ 2 07:30 దుబాయ్
14-నవంబర్ ఫైనల్ 07:30 దుబాయ్

టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌‌గా నిలిచిన టీం $ 1.6 మిలియన్ డాలర్లు(రూ 12.02 కోట్లు), రన్నరప్‌లకు $ 800,000 మిలియన్ డాలర్లు(రూ. 6 కోట్లు) దక్కనున్నాయి. అలాగే సెమీ ఫైనలిస్టులకు ఒక్కొక్క టీంకు $ 400,000 మిలియన్ డాలర్లు(రూ. 3 కోట్లు) లభిస్తాయి.

మ్యాచుల ప్రత్యక్ష ప్రసారాలు: అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. తెలుగులో చూడాలనుకునే వారు మాత్రం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్ చూడొచ్చు. అలాగే యాప్‌లో చూడాలనుకునే వారు డిస్నీ హాట్ స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మ్యాచులను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు.

Also Read: T20 World Cup: తొలిసారి ప్రపంచకప్‌ బరిలో 7గురు భారత ఆటగాళ్లు.. పాకిస్తాన్ మ్యాచుతో 4గురి ప్రయాణం మొదలు.. వారెవరంటే?

T20 World Cup 2021: 16 జట్లు.. 45 మ్యాచ్‌లు.. 28 రోజులు.. నేటి నుంచే టీ 20 ప్రపంచకప్.. అందరి చూపు ఆ మ్యాచ్‌పైనే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!